తిరుపతి సభలో పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి | pawan should warn fans in Tirupathi sabha

Pawan should warn fans in tirupathi sabha

pawan speech tirupathi sabha, Pawan Speech, Pawan Speech about Fans, Pawan Fans Speech, pawan kalyan warn fans

pawan kalyan should warn fans in Tirupathi sabha.

పవన్ ప్రసంగంలో రెండు ముక్కలు చెప్పినా చాలు

Posted: 08/27/2016 12:35 PM IST
Pawan should warn fans in tirupathi sabha

తెలుగు ప్రజలు, మీడియా కళ్లన్నీ ఇప్పుడు తిరుపతి వైపే ఉన్నాయి. హీరో, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ప్రస్థానం సభలో ఏం మాట్లాడతారు అన్న టాపిక్ పైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. రాజకీయాలపైనా అని మాగ్జిమమ్ ఫిక్సయినప్పటికీ, హద్దులు దాటిపోయిన అభిమానంపై కూడా గొంతు విప్పాలని పలువురు కొరుకుంటున్నారు. ఓ సినిమా షూటింగ్ సిద్ధమౌతున్న నేపథ్యంలో అభిమాని హత్య ఉదంతంతో పవన్ చలించిపోయాడు. ఈ నేపథ్యంలో హడావుడిగా అక్కడికి వెళ్లి వినోద్ కుటుంబాన్ని పరామర్శించడం, ఆపై సభ ఏర్పాటు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

రాజకీయ కోణాల్లో... రెండేళ్ల కిందట ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అప్పుడు ప్రధాని మోదీ, చంద్రబాబు తదితర కీలకనేతలు వేదికపై ఉన్నారు. ఇప్పుడు అదే వేదికగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి కేంద్రాన్ని కడిగిపడేందుకే ఈ సభ అని చెప్పుకుంటున్నారు. జనసేనను స్థాపించే సమయంలో అసలు ప్రశ్నించేందుకే ఈ పార్టీ పేట్టానని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు చాలా సార్లు వచ్చింది. అయినా అరకొర ప్రెస్ మీట్ లతో స్పష్టత ఇవ్వకుండా పవన్ దాటవేసుకొచ్చాడు. రాజకీయంగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ పవన్ గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే ఈ సభ అని జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పైగా కీలకమైన కాపు ఉద్యమంపై కూడా ఇందాకా ఎటువంటి స్పందన లేకపోవటం, ఆ సామాజిక వర్గ పెద్దలు రెండు రోజులుగా గెస్ట్ హౌజ్ లో ఉన్న పవన్ ని కలవటం వంటి పరిణామాలు ఇది రాజకీయ మీటింగే అని చెప్పకనే చెబుతున్నాయి.

ఇక ప్రత్యేక హోదా పై కేంద్రం చేస్తున్న అన్యాయంపై కూడా గళం విప్పే అవకాశం ఉంది. అయితే కేవలం ఊకదంపుడు ప్రసంగం కాకుండా, అర్థవంతంగా దాని వల్ల కలిగే లాభాలతో కూలంకశంగా మాట్లాడాలని పలువురు కోరుకుంటున్నారు. ఇక ఇదే వేదికగా మిత్రపక్షాలతో కటీఫ్ అంశంపై కూడా క్లారిటీ రావొచ్చనే అనుకోవచ్చు. టీడీపీతో కలిసి కేవలం బీజీపీపైనే యుద్ధం ప్రకటించడమా? లేక వైకాపా, కాంగ్రెస్ లతో కలిసి మిత్రపక్షాలపై ఎదురుదాడికి దిగడమా? ఇవేవీ కాకుండా ఒంటరి పోరాటమా? అన్నది తేలే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ సభ తర్వాత విజయవాడలో ఓ మహసభ నిర్వహించాలని, ఆపై జిల్లాల వారీగా వరుసగా సభలు పెట్టాలని జనసేన ఇప్పటికే తీర్మానం చేయటంతో రాజకీయంగా దూకుడు ప్రదర్శించబోతుందా అని అనుకోకుండా ఉండలేం.   

మరోవైపు వినోద్ రాయల్ అభిమాని హత్య నేపథ్యంలో హఠాత్తుగా తిరుపతి వెళ్లిన పవన్ అభిమానుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా తన స్పీచ్ లో కాసేపైనా మాట్లాడుతాడా? అన్న ప్రశ్నలు కూడా పుడుతున్నాయి. జిల్లాల నుంచి తరలి వస్తున్న జనసేన కార్యకర్తలను ఆపేసి కేవలం అభిమానులను మాత్రమే ఆహ్వానించడం, పైగా గ్రౌండ్ కెపాసిటీ చిన్నది కావటంతో ఇది అభిమానుల కోసమేనన్న కోణం కూడా వ్యక్తం అవుతుంది. పవర్ ఫుల్ స్పీచ్ లకు పెట్టింది పేరైన పవన్ పంచ్ డైలాగులు వాడకుండా తాను అతి దగ్గరగా చూసిన ఓ తల్లి కన్నీటి ఆవేదనను అభిమానులకు వివరించి, అభిమానం ఉండాల్సిన స్థాయిని, ఇతర హీరోల అభిమానులతో ఘర్షణలు వద్దని ఒక్క నిమిషం, కనీసం  ఓ రెండు మాటలు మాట్లాడాలని చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు కొరుతున్నారు. అయితే కేవలం గంట ఉపన్యాసంలో పైన చెప్పినవన్నీ జరగడమనేది కాస్త కష్టమే అయినా ఆశించడంలో తప్పేం లేదు కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Tirupathi  sabha  speech  fans  

Other Articles