తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట పవన్ బహిరంగసభ | Pawan Jana Sena Prasthanam public meeting in Tirupati

Pawan jana sena prasthanam public meeting in tirupati

Pawan Jana Sena Prasthanam meeting, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting

Pawan Jana Sena Prasthanam public meeting in Tirupati.

తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట పవన్ బహిరంగసభ

Posted: 08/26/2016 03:18 PM IST
Pawan jana sena prasthanam public meeting in tirupati

పవన్ ప్రత్యక్ష రాజకీయ ఆరంగ్రేటానికి తిరుపతి వేదిక కానుందా? ఇంతకాలం స్లీప్ మోడ్ లో ఉన్న జనసేన యాక్టివ్ కానుందా? త్వరలో పవన్ పూర్తిస్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే హఠాత్తుగా ప్రకటించిన సభ ఏర్పాట్లు సంకేతాలు అవుననే సంకేతాలను అందిస్తున్నాయి. గురువారం హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడే గెస్ట్ హౌస్ లో ఆయన పలువురితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇంతలోనే సభ గురించి వార్త వెలువడటం విశేషం.

శనివారం సాయంత్రం తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట ఇందిరా మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించగా, పవన్ కళ్యాణ్ కోటరీ అందుకోసం ఏర్పాట్లను ప్రారంభిస్తోంది. ఈ సభ వేదిక ద్వారా పవన్ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రత్యేక హోదా, తదితర విషయాలపై స్పందించే అవకాశముందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొద్దికాలంగా క్రియాశీలత తగ్గించిన పవన్ మొన్న ప్రత్యేక హోదా పోరు సమయంలోనూ పెద్దగా స్పందించలేదు. దీంతో బహిరంగ సభ నిర్వహించి కార్యాచరణ ప్రకటించే ఉద్దేశంలో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

గతంలో పవన్ సోదరుడు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలోనే ప్రకటించి, అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో పవన్ కూడా అన్న బాటలోనే నడుస్తాడా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్న పవన్ ఆ అవగాహనను కొనసాగిస్తారా లేదంటే విభేదిస్తారా? ప్రత్యేకంపై పోరులో విపక్షాల వెంట నడుస్తారా? ఒకవేళ ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ తెగతెంపులు చేసుకుంటే, జనసేనతో కలిసి చంద్రబాబు కేంద్రంపై పొరు చేస్తారా? ఇలా ఎవరికి వారే భేరీజులు వేసుకుంటున్నారు. ఇక కొందరు కార్యకర్తలేమో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే పవన్ స్వయంగా తిరుపతి నుంచి పోటీ చేస్తారని, అందుకే ఈ సభ అంటూ చెబుతున్నారు.

అయితే బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్న మైదానం వేదిక కేవలం ఏడెనిమిది వేల మంది పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ సభనా లేక కేవలం అభిమానులను ఉద్దేశించి మాట్లాడే సభనా అనే ఉత్కంఠ కూడా సాగుతోంది. ఏదేమైనా పవన్ సభ నిర్ణయం ఆకస్మికంగా వెలువటంతో రాజకీయ వర్గాలు ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  public meeting  Indira ground  

Other Articles