Sucha Singh Chhotepur sacked as AAP’s Punjab convener over cash for tickets sting

Aap removes sucha singh chhotepur as punjab convenor

sucha singh chhotepur, sucha singh chhotepur sacked, punjab aap convener, sucha singh chhotepur aap, sucha singh chhotepur sting, aap punjab

AAP sacked its Punjab convenor Sucha Singh Chhotepur, who was heading the party in the poll bound state, in the wake of allegations that he took bribe from a ticket aspirant.

లంచగొండిపై వేటు వేసిన అవినీతి రహిత పార్టీ..

Posted: 08/27/2016 07:03 AM IST
Aap removes sucha singh chhotepur as punjab convenor

అవినీతి రహిత భారత నిర్మాణ కోసం జన్ లక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన సందర్భంలో ఉద్భవించిన పార్టీ అమ్ అద్మీ. అయితే అవినీతి రహిత పార్టీలో ఏకంగా ఒక రాష్ట్రానికి చెందిన అధ్యక్షుడే అవినితిని పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో పంజాబ్ రాష్ట్ర అమ్ అద్మీ అధ్యక్షుడు సుచా సింగ్ చోటేపూర్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. అతన్ని పంజాబ్‌ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తూ వేటు వేసింది. కాగా, అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

పంజాబ్ లో ఎన్నికలకు వెళ్లడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ సాక్షాత్తు పార్టీ ముఖ్య నాయకుడే చెప్పారు కదా అనుకున్నారో ఏమో గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతడి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. దాంతో పార్టీ రాష్ట్రశాఖ కన్వీనర్ సుచా సింగ్ ఛోటేపూర్‌పై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఛోటేపూర్‌ను స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరినా అందుకు ఆయన నిరాకరించాను. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి అపఖ్యాతి లేదని, కానీ అధిష్టానం, పార్టీ క్రమశిక్షణా విభాగం తన వాదనలను పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుంటుందని అరోపించారు.

అయితే, ఇదంతా తన సొంత పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, ఆరోపణలు నిరాధారమని ఛోటేపూర్ అంటున్నారు. అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ ఛోటేపూర్ డబ్బులు తీసుకుంటుండగా స్టింగ్ ఆపరేషన్ చేశామని, ఆ వీడియో ఇప్పటికే అధిష్ఠానం వద్దకు వెళ్లిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో అవినీతికి చోటు లేదని, సాక్ష్యాధారాలను పార్టీ అగ్రనేతలతో పాటు పార్టీ క్రమశిక్షణా విభాగం పరిశీలించిన మీదటే చర్యలు తీసుకున్నామని పార్టీ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్ షేర్‌గిల్ చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థుడైన ఛోటేపూర్ గత ఎన్నికల్లో గురుదాస్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయతే పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు చోటేపూర్ కు మధ్య గత కోంతకాలంగా చెడిందని, దీంతోనే ఆయనపై స్టింగ్ అపరేషన్ వ్యవహారం జరిగిందని కూడా అరోపణలు వినబడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై ఛోటేపూర్ కొన్ని వ్యాఖ్యలు చేయడమే వారి మధ్య అగాధాన్ని పెంచిందన్న వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి, అందుచేతనే ఇప్పటికే పంజాబ్ ఎన్నికలకు అప్ విడుదల చేసిన రెండు జాబితాలలో ఆయన పేరు లేకపోవడంతో పాటు ఆయన కూడా కనిపించలేదని అరోపణలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sucha singh chhotepur  expelled  punjab aap convener  sting operation  aap punjab  

Other Articles