A Little Kid Hugged Sunny Leone And Refused To Let Go

This sunny leone video is trending and actor is happy about it

Sunny Leone, sunny leone little fan, fan, sunny leone trending Video, sunny leone youtube, sunny leone social media, sunny leone Instagram

A video, currently trending on YouTube, shows the adorable moment a little girl hugged actor Sunny Leone and simply refused to let go.

ITEMVIDEOS: అందాల ఆడబొమ్మ.. చిట్టిపాపను ఎత్తుకున్న ముద్దుగుమ్మ

Posted: 08/27/2016 07:50 AM IST
This sunny leone video is trending and actor is happy about it

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి, సన్నీలియోన్కు కుర్రకారులో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ చిన్నారి పాప సన్నీ లియోన్ను చూడగానే సొంత మనిషిలా దగ్గరయ్యింది. సన్నీని విడిచి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనంటూ మారాం చేసింది. చివరకు అయిష్టంగానే సన్నీని వీడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఈ వీడియో యూ ట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ నెల 20న సన్నీ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అదే రోజు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఓ పాపను సన్నీ లియోను ఎత్తుకుంది. బాగా తెలిసినవారి దగ్గరున్నట్టు ఆ పాప సన్నీ భుజాలపై తలవాల్చి ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆ పాప తల్లిదండ్రులు సన్నీ నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ దగ్గరకు రమ్మని పిలిచినా ఆ పాప సన్నీని వీడి రాలేదు. ఈ తతంగాన్ని గమనించి ఆపాపపై ముచ్చటపడ్డ సన్నీ.. తల్లిదండ్రులకు బై చెప్పమని ఆ అమ్మాయికి చెప్పి కాస్త దూరం తీసుకెళ్లింది. ఆ పాప నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోయింది. కానీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. చివరకు తల్లిదండ్రులు ఆ పాపను బుజ్జగించి సన్నీ నుంచి తీసుకెళ్లారు. తర్వాతి రోజు సన్నీ మరో వీడియోను పోస్ట్ చేసింది. ఫోన్తో సెల్ఫీలు ఎలా తీయవచ్చో ఆ పాపకు సన్నీ నేర్పించింది. కాగా ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఈ ఘటన జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు. వీడియోను బట్టి భారత్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  sunny leone little fan  trending Video  Instagram  youtube  

Other Articles