UK journalist takes credit for PM Modi setting up task force for next three Olympics

Piers morgan tweets again crediting pm modi

Narendra Modi, Piers Morgan, Rio Olympics 2016, India at Olympics, UK journalist, Olympics Task Force, british journalist, indian sprots lovers, twitteratti, social media

British journalist Piers Morgan and his love affair with the Indian sports lovers over the past few days has been one of the most trending topics on social media.

మళ్లీ ఆ జర్నలిస్టు ట్విట్లు.. ప్రధానికి కితాబు

Posted: 08/27/2016 06:16 AM IST
Piers morgan tweets again crediting pm modi

భారతీయ క్రీడాభిమానులను రెచ్చగొట్టుతూ వారి తిట్టిన తిట్లను చూసుకుని కడుపుబ్బ నవ్వుకునే  అలవాటును అలవర్చుకున్న బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ ఇంకా వదులుకోలేదు. రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండే పతకాలు వచ్చినా సంబరాలు ఎందుకు చేస్తున్నారంటూ ట్వీట్ చేసినప్పటి నుంచి ఆయన ట్రెండ్ అవుతున్నారు. ఆయన ఆ ట్వీట్ చేసిన వెంటనే వేలాది మంది భారతీయులు మోర్గాన్ మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. చివరకు భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మోర్గాన్‌ను తీవ్రంగా ఖండించాడు. తనదైన శైలిలో ప్రతివిమర్శలు చేశాడు.

ఇక వివాదం అంతా సర్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో మోర్గాన్ మరోసారి భారత క్రీడాభిమానులను రెచ్చగోట్టాడు.''ఇండియన్ ట్విట్టర్, ఎందుకు సైలెంటుగా ఉన్నారు.. మీ గాయాలకు మందులు పూసుకుంటున్నారా'' అంటూ రెచ్చగొట్టేలా మరో ట్వీట్ పెట్టాడు. అయితే దీనిపై భారత ట్విట్టరైట్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తరువాత మరో మారు కూడా ట్విట్ చేశాడు. ఈ సారి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కితాబునిస్తూ ట్విట్ చేశాడు. 2020 టోక్యో ఒలంపిక్స్ కోసం ప్రధాని మోదీ ఇప్పటి నుంచే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ముదావాహమని అన్నారు,

అయితే ఆయన ఎందుకిలా ట్విట్ చేశారన్న అనుమానం కులుగుతుందా...? ఏం లేదండీ ఇలాంటి ట్విట్టు చేసిన.. సెంటిమెంట్ బలంగా వున్న భారత్ లాంటి దేశస్థులు ఆయనను ఫాలో అవుతారని, దీంతో ఆయన తన పేరును ట్రెండింగ్ కూడా చేసుకోవచ్చునన్న చిన్న ఆశతోనేనట. గాయాలకు మందు రాసుకుంటున్నారా..? అన్న ట్విట్ వెలువడగానే ఆయనను ఏకంగా 12వేల మంది కొత్తవారు తనను ఫాలో అవుతున్న వారి జబితాలోకి చేరారని ఆయనే ప్రకటించారు. దీనంతటికీ కారణం భారతీయ అభిమానులేనంటూ వారికి థాంక్స్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : piers morgan  british journalist  indian sprots lovers  Rio Olympics  twitteratti  social media  

Other Articles