న్యాయం చేయాలంటూ యూపీ సీఎం అఖిలేష్ కు రక్తం తో లెటర్ రాసింది | Teen Girl Writes Letter In Blood To Akhilesh Yadav Asking Justice

Teen girl writes letter in blood to akhilesh yadav asking justice

Uttara Pradesh CM Akhilesh Yadav, Teen Girl Writes Letter In Blood, Akhlesh Blood letter, Bulandshahr girl letter

Teen Girl Writes Letter In Blood To Uttara Pradesh CM Akhilesh Yadav Asking Justice For Mother Burned Alive.

అఖిలేష్ ఆ బాలిక రక్తానికైనా విలువిస్తాడా?

Posted: 08/12/2016 04:48 PM IST
Teen girl writes letter in blood to akhilesh yadav asking justice

యూపీలో తమ భద్రత ప్రశ్నార్థకంగా మారి అఘాయిత్యాల పర్వం పెట్రేగిపోతున్న వేళ మహిళలంతా కలిసి రోడ్డెక్కి నిరసన జ్వాలలు రగిల్చారు. ఈ సమయంలోనే ఓ చిన్నారి ముఖ్యమంత్రి అఖిలేష్ కి రాసిన లేఖ పైన తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ లేఖలో బాలిక కోరింది. అయితే ఈ లేఖను మామూలుగా ఇంకుతో కాదు, ఆ చిన్నారి తన రక్తంతో రాసింది.

బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఒక వివాహితకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఈ లేఖను సీఎంకు రాసింది. మగ సంతానానికి జన్మ నివ్వలేదనే కారణంగా తన తల్లిని తన తండ్రి మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే సజీవదహనం చేశారని, తనను, తన చెల్లిని ఒక గదిలో బంధించి తమ తల్లికి నిప్పంటించారని పేర్కొంది. తనను, తన చెల్లిని కూడా చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, ఈ విషయమై పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయకపోగా, నిందితులకు వారు రక్షణగా నిలుస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది.

Blood letter to akhilesh

కాగా, ఈ జులైలో ఈ విషయమై సీఎం అఖిలేష్ కు ఈ బాలిక ఒక లేఖ రాసింది. అయితే, దీనిపై సీఎం స్పందించకపోవడంతో, తాజాగా మరోమారు ఈ లేఖను తన రక్తంతో రాసింది. ఈవిధంగా చేస్తే సీఎం స్పందిస్తారనే ఇలా లేఖ రాశానని ఆ బాలిక పేర్కొంది. మహిళను చంపిన మర్నాడే మనోజ్ బన్సాల్ ను అరెస్ట్ చేశారు. అయితే, ఆయన ఇతర కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు కానీ, వారిని అరెస్ట్ చేయలేదని సదరు బాలిక ఆరోపించింది. నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. అయితే, బులంద్ షహర్ సీనియర్ ఎస్పీ అనీస్ అన్సారీ మాత్రం ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులను వదిలిపెట్టమని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttara Pradesh  Bulandshahr  girl  letter  CM Akhilesh Yadav  blood  

Other Articles