అతిపెద్ద జెండా దుబాయ్ లో తయారు చేయించనున్న తెలంగాణ ప్రభుత్వం | Telangana govt approach Dubai for Largest flag

Telangana govt approach dubai for largest flag

Telangana Biggest flag in dubai, dubai biggest flag, KCR biggest flag, Telangana approaches dubai, Big flag for Telangana in Dubai, Telanagana Flag in Dubai, KCR dream flag

Telangana govt approach Dubai for Largest flag.

కలల జెండాకు దుబాయ్ లో శాశ్వత పరిష్కారం

Posted: 08/12/2016 03:12 PM IST
Telangana govt approach dubai for largest flag

ఆవిర్భావ దినోత్సవం నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సగర్వంగా ఎగరవేసిన అతి పెద్ద జాతీయ పతాకం విషయంలో ఏదో ఒకటి తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పంద్రాగష్టు వస్తుండటంతో మరోసారి ఈ అంశం తెరపైకి తెచ్చిన అధికారులు ఇప్పుడు శాశ్వత పరిష్కారం కోసం దుబాయ్ వైపు చూస్తున్నారు.

303 అడుగుల ఎత్తైన స్థంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తు ఉన్న ఈ జాతీయ పతాకం బలమైన గాలులకు పలుమార్లు చినిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పోచంపల్లి పట్టుతో మరో కొత్త జెండాను రూపొందించి ఎగరవేశారు. అయితే బలమైన గాలులు వీచే ప్రాంతంలో దీని ఏర్పాటు చేయటం కారణంగా అది మళ్లీ మళ్లీ చినిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖాళీగానే ధ్వజస్థంభాన్ని ఇన్నాళ్లూ ఉంచారు. అయితే జెండా పండగ వస్తుండటంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఎగరవేయాల్సిన అవసరం రావటంతో దుబాయ్‌కు చెందిన చానల్ గ్రూప్ ఇంటర్నేషనల్ నుంచి జెండాను కొనుగోలు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.

గతంలో జెండా కోసం లక్షన్నరకు పైగానే వెచ్చించడంతో ఇక కొత్త జెండా కోసం దుబాయ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. దాని విలువ సుమారు రూ.3.2 లక్షల పైగానే ఉంటుందని సమచారం. అల్ట్రావైలట్(యూవీ) కోటింగ్‌ ఉండడం వలన ఈ జెండా రంగు మారదని, తయారీలో ట్రిపుల్ యార్న్‌ను వాడడం వల్ల బలమైన గాలులను సైతం తట్టుకునే సామర్థ్యం ఈ జెండాకు ఉంటుందని అంటున్నారు. ఇక ఆగష్టు 15న కొత్త జెండా ఎగురవేయడం మినహా అక్కడ మరే ఇతర కార్యక్రమాలు చేపట్టడం లేదని హెచ్ఎండీఏ ఇదివరకే ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Big flag  Dubai  August 15  

Other Articles