US First Daughter Sasha Obama serves seafood in summer job | హోటల్ వెయిట్రెస్ గా ఒబామా కూతురు

Us first daughter sasha obama serves seafood in summer job

Sasha Obama, daughter of US President Barack Obama, President daughter as waitress, Obama Daughter waitress, Sasha Obama

Sasha Obama, daughter of US President Barack Obama, has swapped the comforts of the White House for the counter of a seafood restaurant, US media report. The 15-year-old has taken a summer job serving food at the business in Martha's Vineyard, Massachusetts.

వైట్ హౌజ్ టూ హోటల్ వెయిట్రెస్

Posted: 08/06/2016 09:32 AM IST
Us first daughter sasha obama serves seafood in summer job

సకల రాజభోగాలు.. చుట్టూ జెడ్ కేటగిరీ భద్రత... వీవీఐపీ మర్యాదలు.... ఇలాంటి లగ్జరీ లైఫ్ ఇవన్నీ వదులుకోవాలంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ, కష్టాల నుంచి పైకొచ్చిన ఒబామా తన ఇద్దరు కూతుళ్లకు మాత్రం వాటి రుచి చూడాలని చెబుతున్నాడు. అందుకే తన కూతుళ్లలో ఒకరితో ఎలాంటి పనులు చేయిస్తున్నాడో చూడండి.

మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడి పగ్గాల నుంచి బరాక్ ఒబామా విముక్తి కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కూతురు సాషా ఇప్పుడు సీ ఫుడ్స్ కు ఫేమస్ అయిన నాన్సీ అనే రెస్టారెంట్ లో వెయిటర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తోంది. బ్లూ షర్టు, ఖాకీ బ్యాంక్స్ వేసుకుని తలపై టోపీతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవటం, క్యాష్ కౌంటర్ బాధ్యతలను ఆమె చూస్తోంటోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ కావటంతో రెస్టారెంటుకు వస్తున్న కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందట. ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు ఆమెకు భద్రతగా ఉండటం గమనించిన మిగతా వెయిరట్లు ఆమె ఎవరన్నది తర్వాత తెలుసుకుని ఆశ్చర్యపోయారంట. కాగా, నాన్సీ రెస్టారెంట్ యజమాని ఒబామాకు మంచి స్నేహితుడని, అందువల్లే ఆమె ఇక్కడ చేరిందని సమాచారం.

ప్రస్తుతం 15 సంవత్సరాల వయసున్న సాషా తన జీవితంలో సగభాగం వైట్ హౌజ్ లోనే గడిపింది. తన తండ్రి వైట్ హౌస్ ను వీడాల్సి వచ్చిన సమయం దగ్గర పడిన వేళ, జీవన గమనానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టి ఆ క్రమంలోనే ఇలా ఉద్యోగాలు చేస్తుందట. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆమె, మీడియా రంగంలో స్థిరపడాలన్నదే తన జీవిత లక్ష్యమని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  daughter  Sasha  waitress  

Other Articles