chandrabababu says sujana shouldn't have done that act

Ap cm chandrababu naidu meets pm modi on special status

sujana chowdary, union minister, jairam ramesh, manmohan singh, kvp ramachandra rao, special status to ap, ap special status issue Rajya Sabha, Rajy sabha manmohan singh, upa government, nsa government, modi, arun jaitley, andhra pradesh, chandrababu naidu, Ys jagan, Raghuveera reddy, rahul gandhi

union minister sujana chowdary shouldn't have welcome bjp holding the KVP private bill on Andhra Pradesh Special Status issue in Rajya Sabha, says chandra babu

హోదాపై సుజనా బీజేపి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది కాదు: బాబు

Posted: 08/06/2016 08:43 AM IST
Ap cm chandrababu naidu meets pm modi on special status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా స్పందించారు.  సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం, బల్లలు చర్చడం సరికాదని అన్నారు. ఓ పక్క రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగి ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.

ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేస్తున్నానని కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. మరోపక్క, తాను ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లలేదని పుష్కరాలకు మోదీని ఆహ్వానించడానికి వెళ్లానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  sujana chowdary  ap special status  KVP ramchandra rao  chandrababu  Ys Jagan  

Other Articles