న్యూయార్క్ లో పోలీసులపై కాల్పులు | Shots Fired At New York Police Officers Narrowly escaped

Shots fired at new york police officers narrowly escaped

Brooklyn police attack, Shots Fired At New York Police, police escaped from attack, newyork police attack, Police Officers Narrowly escaped

Shots Fired At New York Police Officers Narrowly escaped.

అమెరికాలో మరోసారి నల్లజాతీయుల దాడి?

Posted: 07/20/2016 01:39 PM IST
Shots fired at new york police officers narrowly escaped

అమెరికాలో మరోసారి పోలీసులపై కాల్పులు కలకలం రేపాయి. తాజాగా న‌ల్ల‌జాతీయుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో డల్లాస్‌లో పోలీసుల‌పై జ‌రిపిన కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. ఆ త‌రువాత బ్యాటెన్ రోజ్‌లో ఓ దుండ‌గుడు పోలీసులపై కాల్పుల‌కు తెగ‌బ‌డి అల‌జ‌డి రేపిన సంగ‌తి తెలిసిందే.

అవి మ‌ర‌వ‌క‌ముందే మ‌రోసారి న్యూయార్క్‌ పోలీసుల‌పై జ‌రిపిన కాల్పులు భయాందోళనలు రేకెత్తించాయి. మంగళవారం రాత్రి బ్రూక్లిన్ లో ఇద్ద‌రు పోలీసు అధికారులు అక్క‌డి ప్రాంతంలో న‌డుచుకుంటూ వెళుతుండ‌గా కారులో వ‌చ్చిన న‌లుగురు దుండ‌గులు ఒక్క‌సారిగా వారిపై కాల్పులు జ‌రిపారు. అయితే, దుండ‌గులు జ‌రిపిన‌ కాల్పుల నుంచి పోలీసులు త‌ప్పించుకోగ‌లిగారు. దుండ‌గులు వారి కారుని అక్క‌డే వ‌దిలేసి ప‌రార‌య్యారు.

కాగా, కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసుల‌పై జ‌రుగుతోన్న కాల్పుల నేప‌థ్యంలో వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New York Police  Brooklyn  black racism  attack  dallas attack  

Other Articles