కార్గిల్ వార్ సమయంలో యుద్దం మిస్సయ్యిందా | Kargil War India Was Minutes Away From Bombing Pak

Kargil war india was minutes away from bombing pak

Kargil War 1999, India miss chance in Kargil war, India bombing pakistan, India plan bombing, Kargil War India just miss the chance

In Kargil War India Was Minutes Away From Bombing Pak Bases.

భారత్-పాక్ యుద్ధం ఎందుకు ఆగిందంటే...

Posted: 07/20/2016 09:05 AM IST
Kargil war india was minutes away from bombing pak

సరిహద్దులో భారత ఆర్మీ దళాలు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి. వాయు దళం ద్వారా దాడులు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. లక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నారు. ఏ క్షణంలోనైనా దాడి ప్రారంభమయ్యే అవకావం ఉంది.... ఆగండి పరిస్థితి మాములుగా ఉన్న సమయంలో ఈ యుద్ధం గోల ఏంటంటారా? ఇది ఇప్పుడు కాదు కార్గిల్ వార్ సమయంలో చోటు చేసుకున్న ఘటన. కాస్తలో పాక్ పై యుద్ధం చేసి మట్టి కరిపించే ఛాన్స్ భారత్ చేజేతులారా మిస్ చేసుకుంది.

1999 మే నెలలో కార్గిల్ లోని భారత శిబిరాన్ని పాక్ ఆర్మీ ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఓ వైపు దాడులను ప్రతిఘటిస్తూనే... మరోవైపు మంచి తనాన్ని పాటిస్తూ భారత్ పాక్ తో చర్చలు జరిపింది. ఈ క్రమంలో జూన్ 12న అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ - పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మధ్య ఢిల్లీలో చర్చలు జరగగా, అవి విఫలమయ్యాయి. దీంతో పాక్ తో యుద్ధానికి భారత్ సన్నద్ధమైంది.

జూన్ 13 తెల్లవారుజామున పాక్ లోని వైమానిక స్థావరాలపై దాడికి సిద్ధంగా ఉండాలని భారత వాయు సేనకు ఆదేశాలు అందాయి. ఇందుకోసం జమ్మూకశ్మీర్ ఎయిర్ బేస్ నుంచి నాలుగు మిగ్ 27 విమానాలకు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టార్గెట్లను నిర్దేశించారు. అత్యాధునిక ఆయుధాలు కలిగిన రెండు మిగ్ 21 విమానాలతో పాటు ఇతర ఎయిర్ బేస్ ల నుంచి మరో పది మిగ్ 29 యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేశారు. దాడికి వెళ్ళే పైలెట్లకు రూట్ మ్యాపులు - రక్షణకు గన్స్ ఇచ్చారు. జూన్ 13 ఉదయం 6.30 గంటలకు పాక్ పై దాడికి సర్వం సిద్ధమైంది

అయితే ఆ రోజు ఉదయం మూడు గంటలకు పాక్ పై దాడికి దిగాలనే ఆదేశాలు ఆగిపోయాయి. దీంతో యుద్ధం ఆగిపోయింది. అయితే ఇంత పకడ్బందీగా యుద్ధానికి సిద్ధమైన భారత దేశం అకస్మాత్తుగా ఎందుకు వెనక్కు తగ్గింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరోవైపు ఆ సమయంలోనే భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ స్థావరాన్ని భారత సైన్యం తిరిగి సొతం చేసుకుంది. పాక్ తోకముడవగా భారత సైన్యం విజయం సాధించింది. ఓ పైలెట్ రాసుకున్న డైరీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ ప్లాన్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది.

ఒకవేళ ఆనాడు గనక భారత్ గనక ఆ రోజు పాక్ పై దాడి చేసి ఉంటే.... కవ్వింపు చర్యలు, ముంబై మారణహోమం, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి అంతేందుకు అసలు ఉగ్రవాదం అనే ఊసు ఉండేది కాదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kargil war  1999  India  Airforce  Pakistan  attack  bombing  

Other Articles