Legendary playback singer Mubarak Begum dies at 80

Lata mangeshkar pays tribute to mubarak begum shaikh

begum mubarak, begum mubarak death, lata mangeshkar, lata mangeshkar begum mubarak, begum mubarak lata mangeshkar, lata begum, begum lata, music, bollywood melodies, entertainment news

Lata Mangeshkar expressed condolences over the death of Mubarak Begum Shaikh, with whom she had sung a duet in 1955.

ప్రముఖ గాయని ముబారక్ ఇక లేరు.. బాలీవుడ్ దిగ్బ్రాంతి..

Posted: 07/20/2016 07:11 AM IST
Lata mangeshkar pays tribute to mubarak begum shaikh

బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకురాలు, లెజండరీ సింగర్ ముబారక్ బేగం షేక్(80) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స సోందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అమెకు నివాళులు అర్పించారు. దిగ్గజ సంగీత దర్శకులైన ఎస్‌డీ బర్మన్, శంకర్ జైకిషన్, ఖయ్యం తదితరులతో కలిసి అనేక చిత్రాలకు అమె పాటలను అలపించారు. 1950-60లలో తన గానామృతంతో ఎన్నో పాటలకు ఆమె ప్రాణం పోశారు.

‘కభి తన్హాయియో మే హమారి యాద్ ఆయేగి’, ‘వో నా ఆయేగీ పలట్ కర్’ వంటి పాటలతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ముబారక్ బేగం మరణవార్త తెలిసిన తరువాత ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ అమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తమ కాలం సినీ నేపథ్య గాయని తమ మధ్య లేకుండా వెళ్లిపోయిందని, ఇది తమను తీవ్ర విషాదంలోకి నెట్టిందని, అమె ఆత్మకు శాంతి చేకూరాలని, అమెకు తాను శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు లతా మంగేష్కర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కోన్నారు.

ముబారక్ బేగంతో కలసి పాడిన పాటలను, అమెతో తన కెరీర్ ప్రారంభంలో కలసి పంచుకున్న అనుభవాలు తన కెరీర్ లో చాలా ఉపయోగపడ్డాయని మంగేష్కర్ తెలిపారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చివరలో ఆర్థిక సమస్యలతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెకు చివరి కాలంలో తన కోడుకు హుస్సేన్, కోడలు జరినా, మనుమరాలు సనాతోనే అధిక కాలం గడిపారు. ముబారక్ బేగం అంత్యక్రియలు ఇవాల నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mubarak begum  play back singer  bollywood  celebrities  lata mangeshkar  tributes  

Other Articles