బీజేపీకి షాక్ ఇచ్చిన సిద్దూ ఆప్ లో చేరే అవకాశం | BJP Rajya Sabha MP Navjot Sidhu resigns

Bjp rajya sabha mp navjot sidhu resigns

Navjot Singh Sidhu quit BJP, Navjot Sidhu resigned, Navjot Sidhu join in AAP, BJP Rajya Sabha MP Navjot Sidhu resign

BJP Rajya Sabha MP Navjot Sidhu resigns and likely to join in AAP.

బీజేపీకి, ఎంపీ పదవికి సిద్దూ రాజీనామా

Posted: 07/18/2016 03:31 PM IST
Bjp rajya sabha mp navjot sidhu resigns

ప్రముఖ క్రికెటర్, సీనియర్ బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ తన ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం బీజేపీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే ఆయన ఆప్ లో చేరతారని గత కొద్ది కాలంగా ఊహాగానాలు వినిపిస్తుండగానే షాకివ్వటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ కు అందించగా, అది ఆమోదం పొందింది.

మరోవైపు సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ పంజాబ్ నుంచి బీజేపీ పార్లమెంట్ వ్యవహారాలను చూస్కోంటోంది.దీంతో ఆమె కూడా రాజీనామా చేయొచ్చనే అంటున్నారు. కాగా, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అకాలీదళ్ తో పొత్తు వద్దని గత కొద్దికాలంగా సిద్దూ ఆయన భార్య కౌర్ ఇద్దరు అధిష్ఠానాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. అయినా ఉమ్మడిగానే వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది దీనికి నిరసనగానే వారు రాజీనామా చేసినట్లు సమాచారం.

ఇక 2017 లో జరిగే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అమృత్ సర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది లోక్ సభకు వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Rajya sabha MP  Navjot Singh Sidhu  resign  AAP  2017  Punjab elections  

Other Articles