ట్వీట్లతో కోట్ల ఆదాయం సంపాదిస్తున్న యువకుడు | Kris Sanchez makes $500,000 a year tweeting random facts

Kris sanchez makes 500 000 a year tweeting random facts

Kris Sanchez, crores with tweets, $500,000 with tweets, Kris Sanchez earn crores by social media, earn crores with social media, UberFacts head, Kris Sanchez UberFacts

Kris Sanchez makes $500,000 a year tweeting random facts.

వావ్... ట్వీట్లతో కోట్లు సంపాదిస్తున్నాడు

Posted: 07/18/2016 04:09 PM IST
Kris sanchez makes 500 000 a year tweeting random facts

పాతికేళ్ల ఓ యువకుడు సరదా కోసం చేసిన ప్రయత్నం అతన్ని కోటీశ్వరుడిని చేసింది. ప్రస్తుతం చాలా మంది జీవితాలతో ముడిపడి ఉన్న సోషల్ మీడియానే అతని ఆయుధం అయ్యింది. సమాచారాన్ని క్షణాల్లో వ్యాప్తి చెందించడమే కాదు, సంపాదన అది కూడా కోట్లలో వెనకేసుకుంటున్నాడు ఆ యువకుడు. అతడెవరో... ఏం చేస్తున్నాడో... ఇది చదివితే మీకే తెలుస్తుంది.

క్రిస్ సాంచే అనే యువకుడు సరదాగా సోషల్ మీడియాలో ‘ఉబర్ ఫ్యాక్ట్స్ ’ పేరిట ఓ ఖాతాను తెరిచాడు. చాలా మందికి తెలియని విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండేవాడు. దీంతో, అతని ఫాలోవర్స్ సంఖ్య నానాటికీ పెరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం ఖాతాలలో మొత్తం కోటి ఎనభై లక్షల మంది అతనికి ఫాలోవర్లుగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొన్ని ప్రచురణ సంస్థలు క్రిస్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. తమ కంపెనీకి చెందిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను క్రిస్ కు అందజేయడం, వాటిని అతను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం చేశాడు. తద్వారా ఆయా అంశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం సదరు ఫాలోవర్లు ప్రచురణ సంస్థల వెబ్ సైట్లను ఆశ్రయిస్తుండటం, వారికి భారీగా లాభాలు రావటం ఇలా జరుగుతూ వస్తోంది.

kris sanchez UberFacts earn crores

అయితే మొదట్లో దీన్ని సాంచే దీన్నో ఆదాయ మార్గంగా చూడలేదట. సోషల్‌ మీడియాలో అతని ఫాలోయింగ్‌ను చూసి ‘చాచా’ అనే కంపెనీ.. అతన్ని సంప్రదించిందట. సోషల్‌మీడియాలో ఎలా ఉండాలి? వీక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఎలాంటి ఫోటోలు పెట్టాలి? వంటి సూచనలతో పాటు.. పలు విధాల నమూనాలను అందించారు. అదే ఇప్పుడు ప్రస్తుతం క్రిస్ లైఫ్ ని మలుపు తిప్పింది. ప్రచురణ సంస్థల వెబ్ సైట్లను క్రిస్ ఫాలోవర్లు ఎంతమంది అయితే చూస్తారో అంతకు సరిపడా డబ్బును లెక్క గట్టి సదరు సంస్థలు ఇస్తున్నాయి.

అంతేకాకుండా, పలు సంస్థల ఉత్పత్తులు, సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా క్రిస్ తన ఖాతాలో పోస్ట్ చేస్తూ తద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ మార్గాల్లో ఏడాదికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తూ క్రిస్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మొత్తానికి ఉద్యోగాన్ని వదిలి సాహసం చేసిన క్రిస్‌ సాంచే తనకు ఇష్టమైన రంగంలోనే డబ్బులు సంపాదిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kris Sanchez  UberFacts  tweets  crores  

Other Articles