ఈ సీఈవోకు ఊహించని షాక్ ఇచ్చిన ఉద్యోగులు | grateful employees gives big shock to Gravity CEO

Grateful employees gives big shock to gravity ceo

Gravity CEO Dan Price, Gravity employees Tesla car to CEO

Grateful employees gives big shock to Gravity CEO Dan Price.

ఆ సీఈవోకు ఊహించని షాక్ ఇచ్చిన ఉద్యోగులు

Posted: 07/15/2016 06:20 PM IST
Grateful employees gives big shock to gravity ceo

బాస్ మంచోడైతే ఉద్యోగులు మరింత మంచోళ్లని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. ఏదైనా కంపెనీ లాభాల బాట పట్టిందంటే ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు, అదనపు జీతాలు, బహుమతులు, ఔటింగ్ తీసుకెళ్లటం, పార్టీలు ఇవ్వటం లాంటివి చేసి ఖుషీ చేయిస్తుంటాయి. కానీ, గ్రేవిటీ కంపెనీలో ఉద్యోగులు చేసిన పని చూస్తే ఎవరైనా అవాక్కు కావాల్సిందే.

ఉద్యోగులు అంతా కలిసి తమ సీఈవో డాన్ ప్రైస్ కు పెద్ద షాక్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. అంతలా ఆయన ఏం చేశారంటారా?కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏడాదికి కనీస జీతం 70 వేల డాలర్లు (46.97 లక్షల రూపాయలు) ఉండేలా ఆయన చేశాడు. అంతేకాదు, తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకుని ఉద్యోగులతో సమానంగా తీసుకుంటూ, తన జీతంలో తగ్గించుకున్న మొత్తాన్ని ఉద్యోగుల జీతాలకు కలిపేశాడు. అందుకే డాన్ ప్రైస్ అంటే ఆ కంపెనీ ఉద్యోగులు అంతగా అభిమానం.

మొత్తం 120 మంది గ్రేవిటీ ఉద్యోగులు కలిసి తమ జీతాల్లో కొంత మొత్తాన్ని సేవ్ చేసి, ఆయన కలల కారైన 'టెల్సా'ను బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగులకు సీఈవోతో సమానంగా జీతం పెంచడం ఒక ఎత్తు అయితే... వారి అభిమానం చురగొన్న డాన్ నిజంగా గ్రేట్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gravity  Employees  CEO Dan Price  Tesla car  

Other Articles