హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తిన నరసింహన్ | Governor Narasimhan praised minister Harish Rao

Governor narasimhan praised minister harish rao

Telugu states governor about govt schemes, Narasimhan praised Telangana minister Harish Rao, Narasimhan with Harish rao, Narasimhan in Haritha Haram

Governor Narasimhan praised Telangana minister Harish Rao.

హరీష్ రావును లేపి లేపి వదిలిపెట్టాడు

Posted: 07/15/2016 04:46 PM IST
Governor narasimhan praised minister harish rao

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మేనమామ కేసీఆర్ ను అంటిపెట్టుకుని ఆయన బాటలో నడుస్తూ కీలక నేతగా ఎదిగాడు హరీష్ రావు. పదవుల పంపిణీలో సమయంలో కూడా లేని పోనీ తలనొప్పులు ఎందుకు అనుకున్నాడేమో హోంమంత్రి పదవిని సైతం వద్దనుకుని ఇరిగేషన్ తో సరిపెట్టుకున్నాడు. పదవీ వ్యామోహం లేకపోవటంతోపాటు వారసత్వ పోటీ ఇష్టం లేని ఆయన తాను ఎప్పుడూ సీఎం రేసులో లేనని చాలాసార్లు చెప్పుకోచ్చాడు. ఇలాంటి సమయంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నోటి నుంచి హరీష్ గురించి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మంత్రి హరీష్ రావు సత్తా మాములుది కాదని పొగడ్తలతో ముంచెత్తాడు గవర్నర్ నరసింహన్. శుక్రవారం హరితహరంలో భాగంగా ఇబ్రహీంపూర్ లో జమ్మి చెట్టు నాటి అనంతరం అక్కడి సభలో ప్రసంగించారు. ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా తీసుకు వచ్చే పథకాలు విజయవంతం కావాలన్నా, దానికి సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలను, అధికారులను ముందుండి నడిపించే పాలకపక్ష నేత చాలా అవసరం., ఆ లక్షణాలు హరీశ్ లో పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పథకం విజయవంతం కావాలని హరీష్ రావు చేస్తున్న కృషిని దగ్గరుండి చూస్తున్న ఇలాంటి నేతలు ప్రజలకు చాలా అవసరం అంటూ వ్యాఖ్యానించారు.

బంగారు తెలంగాణ సాధనలో భాగంగా హరీశ్ వంటి నేతలు ఎంతో అవసరమని అన్నారు. ఆయనో మాట అనుకున్నారంటే చేసే తీరుతారని, లక్ష్యం నెరవేరే వరకూ వదలబోరని, అటువంటి నేత మీకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.

అయితే అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ... గవర్నర్ ది మాటంటే మాట, టైమంటే టైమని పొగిడారు. పదిన్నరకు వస్తానని చెప్పిన ఆయన, అంతకన్నా ముందే వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన నుంచే తామంతా స్ఫూర్తిని పొందుతున్నామని అన్నారు. మరి ప్రతిగానే గవర్నర్ హరీశ్ రావును పొగిడారా? లేక ఆయన మనసులో మాటను వ్యక్తం చేస్తారా? అని అక్కడున్న నేతలు చర్చించుకోవటం మొదలుపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu states  governor  narasimhan  T minister  harish Rao  Harithaharam  

Other Articles