రిజర్వేషన్లు వద్దంటున్న ఆ సామాజిక వర్గం ఏది? | Justice Manjunath on Kapu Reservations should delay

Justice manjunath says kapu reservations should delay

AP Kapu Reservations, justice Manjunath Commission, justice Manjunath on Kapu resevation, Chandrababu and Justice Manjunath

Kapu Reservations should delay justice Manjunath said.

రిజర్వేషన్లు వద్దంటున్న ఆ సామాజిక వర్గం ఏది?

Posted: 07/15/2016 08:57 AM IST
Justice manjunath says kapu reservations should delay

దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం ఆయా వర్గాలు రోడ్డెక్కి ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. ఒక రాష్ట్రంలో సమస్య పరిష్కారం అయ్యిందనుకునే లోపు, మరో చోటు ఆందోళనలు నెలకొనటం, దాన్ని పరిష్కరించేలోపు మరోచోట... ఇలా కేంద్రానికి ఊపిరి సలపకుండా పోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యతలను అప్పజెప్పి చేతులు దులుపుకుంటుంది.

ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ల సంగతిని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథకు అప్పజెప్పింది. తొలుత 9 నెలల కాలంలో పూర్తవుతుందని భావిస్తున్నప్పటికీ, మరింత ఆలస్యం జరిగే అవకావం ఉందని ఆయన చెబుతున్నారు. అఖిల భారత కాపు సంఘం నేతలు గురువారం విజయవాడలో ఆయన్ను కలిసి ఈ వ్యవహారంలో తొందరగా ఓ కొలిక్కి వచ్చేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

‘‘రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మినహా మిగిలిన అందరూ రిజర్వేషన్ కోరుతున్నారు. ఇలా అయితే చాలా కష్టం. ప్రజా సాధికార సర్వే ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయి. తద్వారా అందరికీ న్యాయం చేస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వలేమని, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినా త్వరగతిన పూర్తయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మేం మా పని త్వరగతినే పూర్తి చేస్తాం... నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం... ఆపై బాధ్యత అంతా వారిదే(ప్రభుత్వం)... అని ఆయన చెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Kapu reservation  justice Manjunath  Chandrababu Naidu  

Other Articles