Truck Speeds Into Holiday Crowd in Nice, France; Dozens Confirmed Dead

75 feared dead as truck rams into crowd in france

france terror attack, nice terror attack, france bus crash, Bastille Day celebrations, national holiday, Day French, Riviera city of Nice, islamic state france attack, is france attack, france bus attack islamic state, news, world news, france news, international news, latest news, islamic state, nice, france, sebastien humbert, nice bus attack, is social media

A truck sped into a crowd of holiday revelers celebrating Bastille Day in Nice, France on Thursday evening killing dozens and sparking panic in the Mediterranean city.

ITEMVIDEOS:ఫ్రాన్స్ పై తెగబడ్డ ఉగ్రవాదులు.. 75 మంది మృతి

Posted: 07/15/2016 07:15 AM IST
75 feared dead as truck rams into crowd in france

ఫ్రాన్స్ దేశంపై ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. గత ఏడాది నవంబరులో ప్యారిస్ నగరంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డి 130 మంది ప్రాణాలను బలిగోన్నారు. ఈ ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోయి తమ దేశ జాతీయ దినోత్సవం సంబరాలను జరుపుకుంటున్న ప్రాన్స్ దేశ పౌరులపై ముష్కరమూకలు మరోమారు తెగబడ్డాయి. నైస్ నగరంలో నిర్వహిస్తున్న వేడుకల సంబరాల్లో మునిగితేలుతున్న పౌరులపైకి.. మందుగుండు సామాగ్రితో భారీ ట్రక్కు జనంపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో 75మంది దుర్మరణం చెందారు. మరో 50మంది పరిస్థితి విషమంగా ఉంది. 100మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో జాతీయ దినోత్సవ సంబరాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.

ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. దీంతో పోలీసులకు ట్రక్కు డ్రైవర్ కు మధ్య కాల్పులు జరిగాయి. ట్రక్కు డ్రైవర్ ను మట్టుబెట్టిన పోలీసులు.. ఘటనాస్థలం నుంచి తప్పించుకొని రెస్టారెంట్‌లో నక్కిన మరో ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఫ్రాన్స్‌ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి.


ఈ ఘటన చేటుచేసుకున్న నేపథ్యంలో నగరంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నైస్ నగర మేయరు క్రిస్టియన్ ఈస్ట్రోసి కోరారు. గత ఏడాది నవంబరులో ప్యారిస్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 130 మంది మరణించారు. ఫ్రాన్స్ లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఈ దాడిలో అమాయక జనం మరణించారని వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న బ్రిటీష్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bastille Day celebrations  national holiday  Day French  Riviera city of Nice  

Other Articles