13 year old minor molested by shokeeper in muzaffar nagar

Shopkeeper molests 13 year old in muzaffar nagar

13 year old raped, 13 year old molested, minor girl rape, teenage girl rape, minor girl raped by shop keeper, teenage girl raped by shop keeper, shapoor town, shanawaz, muzaffarnagar, lucknow, uttarpradesh, crime on minors, molestation on minors, sexual harrasment on minors

In a shocking inccident, a 13 year old minor girl alleged that a shop keeper shanzwaz had molested her inside the shop

ముజాఫర్ నగర్ లో మరో దారుణం.. 13 ఏళ్ల చిన్నారిపై..

Posted: 07/13/2016 02:04 PM IST
Shopkeeper molests 13 year old in muzaffar nagar

ముజఫర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని అమయాకురాలైన బాలికపై మగమృగం ఘాతుకానికి పాల్పడింది. పదమూడేళ్ల బాలిక ఇంట్లోకని వస్తువులు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లగా.. ఆ దుకాణ యజమానే అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నోటిని బలవంతాన మూసి ఇరుకైన దుకాణంలోనే అమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్యాచార విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దుకాణానికి వెళ్లిన బాలిక చాలా అలస్యంగా ఇంటికి చేరుకోవడంతో అమె తల్లిదండ్రులు అరా తీశారు.

దీంతో బాధితురాలు వెక్కి వెక్కి ఏడుతూ తన తల్లికి తనపై జరిగిన ఘాతుకాన్ని చెప్పింది. దీంతో భాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు భాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఇక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన షానవాజ్ అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడ్ని కటకటాల వెనక్కి నెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లాలోని షాపూర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో నివసించే ఓ పదమూడేళ్ల బాలిక వస్తువులు కొనుగోలు చేసేందుకు స్థానికంగా గల ఓ దుకాణానికి వెళ్లింది. అందులో పనిచేస్తున్న షాన్వాజ్ అనే యువకుడు వస్తువుల పేరిట ఆ బాలికను లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముజఫర్ నగర్ లో ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muzaffarnagar  13 year old girl  rape  shopkeeper  shanawaz  crime  

Other Articles