యూపీ ఎన్నికల్లో అప్పుడే సగం ఓటమి | Congress wrong choice with rajbabbar and masood

Congress wrong choice with rajbabbar and masood

Rajbabbar and Masood for UP election, Congress half lost in UP election. congress big mistake with that decision

Rajbabbar and Masood wrong choice for Congress in UP election.

యూపీ ఎన్నికల్లో అప్పుడే సగం ఓటమి

Posted: 07/13/2016 03:08 PM IST
Congress wrong choice with rajbabbar and masood

2017 ఉత్తర ప్రదేశ్ కోసం ఎన్నికల కాంగ్రెస్ కసరత్తు ముగిసింది. తీవ్ర మల్లాగుల్లాలు పడి సీనియర్ల పేర్లన్నీ పరిశీలించి చివరాఖరికి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను పీసీసీ సారథిగా నియమించింది. అయితే ఎవరూ దొరకనట్టు సోనియా కంటికి ఆయనే కనిపించాడా, అసలు ఆ ఎంపిక సరైన పనేనా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

బబ్బర్ నియామకంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాస్త సమాజ్ వాదీకి చెంచాగా ‘బీ’ పార్టీగా మారిందని బీజేపీ ఇప్పుడు వ్యాఖ్యానించింది. పీసీసీ ప్రెసిడెంట్ రాజ్ బబ్బర్ తోపాటు వైఎస్ ప్రెసిడెంట్ మసూద్ ఇద్దరు కూడా గతంలో సమాజ్ వాద్ పార్టీలోనే కొనసాగారు. పైగా వీరిద్దరి రాజకీయ గతం కూడా ఏమంత ఘనంగా లేదు.

1989 లో జనతా దళ్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బబ్బర్ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 1994 నుంచి 99 దాకా రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. 2004 లో లక్నోలో అటల్ బీహార్ వాజ్ పేయి పైన పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ఎస్పీ ఆయన్ను 2006 లో సస్పెండ్ చేసింది కూడా . అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతూ చివరగా 2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు.

ఇక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మసూద్ యవ్వారం మరీ దారుణం... సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ప్రధాని అభ్యర్థిత్వంపై విరుచుకుపడటంతోపాటు, ముక్కలుగా నరుకుతానంటూ... ఘాటైన వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లోచ్చాడు. మరి ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న వీరిద్దరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పటం కరెక్టేనా? కేవలం బ్రహ్మణ వర్గ మద్ధతు కోసమే రాజ్ బబ్బర్ ను ఎంపిక చేశారని అనుకున్నప్పటికీ అక్కడ ఆయనకు పెద్దగా గుర్తింపు లేదు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ కాదు కదా కాంగ్రెస్ జేజెమ్మ దిగొచ్చిన పార్టీని గట్టెక్కించలేరనేది అక్షర సత్యం.

ప్రాంతీయ పార్టీల పాలనలో యూపీ ప్రజలకు సరైన న్యాయం జరగలేదని, ఇందుకోసం తమ లాంటి జాతీయ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ చెబుతోంది. అలాంటప్పుడు ఆ మూలాల నుంచి వచ్చిన వారికే ఎన్నికల పగ్గాలు కట్టబెట్టడం, పైగా ప్రజలతో కనీసం పాస్ మార్కులు కూడా వేయించుకోలేని వీరితో పార్టీకి మున్ముందు నష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : UP election  2017  congress  Raj Babbar  Masood  sonia gandhi  

Other Articles