33 people hospitalized after K2 overdoses

33 people collapse after taking synthetic marijuana k2

synthetic Marijuana, marijuna, k2, Drug Abuse and Traffic, Emergency Medical Treatment, K2 addicts, Bedford-Stuyvesant, Bushwick, Brooklyn, New York, America

It was like a scene from an episode of The Walking Dead. But it was New Yorkers. they were suffering from bad batch of drugs. 33 people were hospitalized for a possible overdose on K2, a type of synthetic marijuana, in Brooklyn

ITEMVIDEOS: మత్తులో జోగుతూ.. మాటలతో చెప్పలేని పనులు.. !

Posted: 07/13/2016 01:12 PM IST
33 people collapse after taking synthetic marijuana k2

యస్ స్టడీ.. నాకేం కాలేదు.. నెను స్టడీగా వున్నాను.. ఓరేయ్ నన్ను పట్టుకోరా, లేదంటే దారి తప్పిపోతావ్.. అంటూ తప్పతాగిన వాడు వాడి మిత్రుడితో అనే మాటలను మనం నిత్య జీవితంలోనూ చూస్తుంటాం. అడుగుతీసి అడుగేయలేని స్థితిలో ఉండే అలాంటి వారు చూసి కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికోందరు అబ్బో అలా మాత్రం ఎప్పుడు చేయకూడదని వారినే గుణపాఠంగా చేసుకుంటారు. అయితే పిల్లలు మాత్రం వీరిని వింతగా చూస్తుంటారు. అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు సహజం అని అనుకుంటాం.

కానీ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలవడమే కాదు అగ్రరాజ్యంగా బాసిల్లుతున్న అమెరికాలోనూ అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోనూ మత్తలో జోగుతున్న వారు కనిపించారు. కాకాపోతే, అలాంటివారు ఒకరిద్దరు కాదు.. ఒకేసారి ముప్పై మందికి పైగానే. మత్తులో జోగుతున్న వారు రోడ్డలపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. ఇక వీరు కేవలం మధ్యం మత్తులో జోగిన వారు కాదు. ఏకంగా మాదకద్రవ్యాల మత్తు తలకెక్కడంతో వారేం చేస్తున్నారన్న సృహకూడా లేకుండా హడావిడి చేశారు. ఆ మత్తులో కొందరైతే నడిరోడ్డుపైనే చెప్పలేని పనులు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. నియంత్రణ కోల్పోయి వీధుల్లో నానా వీరంగం సృష్టిస్తున్న వీరిని అధికారులు తంటాలు పడి ఆసుపత్రికి తరలించారు. ఇలా ప్రవర్తించిన వీరంతా ప్రమాదకరమైన మత్తుపదార్థం సింథటిక్ మారిజోనాను ఒకేచోట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే.. వీరు తీసుకున్న బ్యాచ్లో మోతాదుకాస్త మించి ఉంటుందని భావిస్తున్నారు. రోడ్లపై వాంతులు చేస్తూ.. తూగుతూ.. కిందపడి పొర్లుతూ వారు చేసిన హంగామా చూసిన వీధిలోని జనాలు భయపడిపోయారు. వారు తీసుకున్న మత్తు పదార్థం తక్కువ ధరకే లభిస్తుందని, అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని వైద్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 33 people  k2 drug  newyork  synthetic marijuana  america  

Other Articles