AP misused extension time to submit EoDB questionnaire: TS official

Telangana govt alleges cyber theft by ap complains to centre

Telangana website, Online application, world bank rank, Telangana, AP government, EODB, minister KTR, Nirmala sitaraman,

Telangana government lodged a complaint with the Cyber Crime Police stating that the AP government had resorted to stealing of its data supplied to the Centre for securing ranks on "Ease of Doing Business."

ఏపీ పక్కా కాఫీ క్యాట్..

Posted: 07/06/2016 08:27 AM IST
Telangana govt alleges cyber theft by ap complains to centre

ఆంద్రఫ్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మేధావి వర్గాలు వున్నారని, వారు ప్రభుత్వాన్ని ముందుకు నడిపస్తున్నారని చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలన్నీ కూడా పసలేనివని తేలిపోయాయి. తెలంగాణ నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల డబ్బును తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో ముట్టజెపుతూ అడ్డంగా రెడ్ హ్యండెడ్ గా దోరికిపోయిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహా ఉదంతానికి తెరలేపారు. స్టీపెన్ సన్ తో తన ఫోన్ సంబాషణకు సంబంధించిన టేపులు లీక్ కావడంతో.. మిన్నకుండిపోయి.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకు ఇంటెలిజెన్స్ ఐజీ అనురాధను బలిపశువును చేసిన చంద్రబాబు.. మళ్లీ నిస్సిగ్గుగా అలాంటి చర్యలకే పాల్పడ్డారు.

నూతనంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి గొడవలు వద్దనుకుంటున్నామని మోహమాటానికి మీడియా ముందు చెబుతున్న చంద్రబాబు.. కావాలని తెలంగాణతో కయ్యానికి కాలుదువ్వుతున్నాట్లుగా వుంది. సులభ వాణిజ్య విధానం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)కు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేసింది. అది కూడా ఎంతలా అంటే మక్కీ టు మక్కీ కాఫీ చేసిన కేవలం తెలంగాణ అన్న చోట అంధ్రప్రదేశ్ అని మార్చివేసింది. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న తెలంగాణ సర్కార్.. ఈ మేరకు సైబర్ క్రైమ్ చట్టం కింద చంద్రబాబు సర్కారుపై కేసు నమోదు చేసింది. ఇదే విషయమై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాంకుల కోసం ఏపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సులభ వాణిజ్య విధానంలో ప్రతి మంత్రిత్వ శాఖ తామిచ్చే అనుమతులకు ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పిస్తోంది. అలా వ్యాపార, వాణిజ్య అనుమతులను సులభతరం చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ర్యాంకులు మరి కొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈవోడీబీ కోసం 340 కాలమ్‌ల సమాచారాన్ని జులై 7 లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారం ఆధారంగా కేంద్రం ఈవోడీబీ స్థానాలను మదింపు చేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అప్ లోడ్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేసి ఏకంగా 22 రోజుల్లో 16 ర్యాంకులు ఎగబాకింది. అయితే చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి ఏ అధికారిని బాధ్యులను చేస్తోరో వేచి చూడాలి మరి..!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  AP government  EODB  minister KTR  Nirmala sitaraman  

Other Articles