Techie commits suicide under mysterious circumstances

Software engineer commits suicide in hyderabs

Techie commits suicide under mysterious circumstances, Shailaja, Tata Consultancy Services, tcs, wipro, techie suicide punjagutta raj bhavan

A 34-year-old woman working for Tata Consultancy Services (TCS) at Begumpet in the city committed suicide by hanging at her residence on Raj Bhavan road.

మరో మహిళా టెక్కీ అత్మహత్య.. అనుమానాస్పదం..

Posted: 07/06/2016 07:41 AM IST
Software engineer commits suicide in hyderabs

అనుమానాస్పద స్థితిలో మరో మహిళా టెక్కి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ పంజగుట్టా పోలిస్ స్టేషన్ పరిధిలో నివసించే వివాహిత అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... రాజ్‌భవన్‌ రోడ్డులోని సాగర్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్థులో నివాసం ఉండే శైలజ (34) బేగంపేటలోని టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త శరత్‌బాబు విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ పాప ఉంది. ఉద్యోగ రిత్యా పాపను సరిగా చూసుకోలేమన్న ఉద్దేశ్యంతో పాపను శైలజ కాకినాడలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంచింది.

తన భర్త ఇంట్లో లేని సమయంలో శైలజ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. భార్య మరణవార్త సమాచారాన్ని పోలీసులు, పొరుగింటివారు అమె భర్తకు అందించినా.. అయన సాయంత్రం వరకు ఇంటికి చేరుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. భర్తతో గొడవపడే శైలజా అత్మహత్యకు పాల్పడిందా..? లేక మరేదైనా కారణాలు వున్నాయా.? అన్న కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shailaja  Software engineer  Suicide  Panjagutta  

Other Articles