Man arrested 36 years after in a rape case

Man arrested 36 years after molestation

rape, gangrape, molestation, thirupathy rao, karimnagar, gangadhara, sarvareddy pally, si ramesh, 36 years, rape on women, violece on women, harrassment on women, crime

After more than 36 years on the run, a man who police say had molested a woman in the native village has been arrested in karimnagar

రేప్ కేసులో నిందితుడు.. 36 ఏళ్ల తరువాత చిక్కాడు..!

Posted: 07/06/2016 09:17 AM IST
Man arrested 36 years after molestation

ఎవరు చేసిన పాపానికి వారు ప్రయాశ్చితం అనుభవించాల్సిందేనన్నది నానుడి. పురాణాల్లో చెప్పినట్లు మనం చేసిన పాపాలు ఒకనాటి రోజుల్లో మన పిల్లలకు తగిలేవి.. కానీ నేటి రోజుల్లో ఎవరు చేసిన పాపాలకు వారే శిక్షలు అనుభవించాల్సిందే. ఏంటి అలోచనలో పడ్డారా..? ఈ ఘటననే మనకు ఉదాహరణ. అత్యాచార కేసులో నిందితుడిగా వున్న ఓ నిందితుడు.. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో వుంటూ.. ఎట్టకేలకు 36 ఏళ్ల తరువాత పట్టబడ్డ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నందెలి తిరుపతిరావు యవ్వనంలో చేసిన తప్పు.. వృద్దాప్యంలో అతని శాపంగా పరిణమించింది. కటకటాల పాటు చేసింది. అంతేకాదు భార్యబిడ్డలకు దూరంగా దేశ సంచారిలో తిరిగేలా చేసింది. వివరాల్లోకి వేళ్తే.. తిరుపతి రావు 1980లో ఓ వివాహితపై లైంగికదాడి చేశాడు. అప్పుడతని వయస్సు 25 ఏళ్లు. బాధితురాలి ఫిర్యా దు మేరకు అప్పట్లో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడి నిందితుడు ఇంటినుంచి పారిపోయూడు.

ఒకటికాదు, రెండుకాదు.. ఏకంగా 36 ఏళ్లుగా ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ తప్పించుకున్నాడు. అరుునవాళ్లందరికీ దూరమై ఒంటరిగా బతకడం, వయోభారం మీదపడటంతో తన కుటుంబసభ్యులను కలుసుకోవాలపొ సోమవారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. అరుుతే, 36 ఏళ్ల క్రితం జరిగిన లైంగికదాడి కేసులో తిరుపతిరావు నిందితుడని తెలుసుకున్న ప్రొబేషనరీ ఎస్సై రమేష్, కానిస్టేబుళ్లు కిరణ్, భూమేష్ గ్రామానికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు.  అనంతరం  కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  molestation  thirupathy rao  karimnagar  gangadhara  sarvareddy pally  crime  

Other Articles