Hyderabad: NIA seizes bullets from houses of ISIS suspects

Nia conduct searches in hyderabad to probe terror module

isis, hyderabad, nia, isis terrorists, nia raids, live ammunition, hyderabad, NIA, ISIS Sympathisers, hyderabad old city, barkas

The raids were conducted at places where men, arrested recently for suspected terror links to ISIS, had stayed.

హైదరాబాద్ లో ఎన్ ఐ ఏ సోదాలు.. కీలక అధారాలు స్వాధీనం..

Posted: 07/06/2016 07:08 AM IST
Nia conduct searches in hyderabad to probe terror module

మహ్మదీయుల పవిత్ర పర్వదినం రంజాన్ పండగకు ముందు ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హైదరాబాద్ లో కూడా విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రణాళికలు రచించి.. భంగపడ్డారు. కాగా హైదరాబాద్ పాత నగరంలో మరోసారి కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి సోదాలు నిర్వహించింది. ఇటీవల పట్టుబడి పోలీసులు అదుపులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాతబస్తీలోని తలాబ్ కట్టా, బార్కాస్ లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. 17 బుల్లెట్లు, 2 స్కానర్లు కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.  హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉదంతంలో ఎన్‌ఐఏ ఇప్పటికే ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అరెస్టు చేయడం తెలిసిందే.

దర్యాప్తులో ఐదు రోజులుగా వారు వెల్లడించిన అంశాల మేరకు ఎన్‌ఐఏ మళ్లీ సోదాలు నిర్వహించింది. తాలాబ్‌కట్టలోని ఇబ్రహీం నివాసంపై దాడి చేసి కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న హబీబ్ నివాసంలో కంప్యూటర్‌తో పాటు 9 ఎంఎంకు చెందిన 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంప్యూటర్ ద్వారానే హబీబ్ తరచూ ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్‌తో మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఇబ్రహీం బావమరిదికి చెందిన షాలిమార్ మీసేవా కేంద్రంలోని మరో కంప్యూటర్, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్ లోనూ ఎన్ఐఏ అధికారులు చేపట్టి నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. మరికొన్ని నగరల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులు జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని సాక్షులు మార్చి తర్వాత వదిలిపెట్టారు. అరెస్టైన ఐదుగురికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ నగరంలో వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు వీరు కుట్ర పనినట్టు వెల్లడైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA  ISIS Sympathisers  hyderabad old city  barkas  

Other Articles