అసదుద్దీన్ మాటలకు అర్థాలే వేరులే! | Asaduddin Owaisi says MIM to give legal aid to ISIS suspects

Asaduddin owaisi says mim to give legal aid to isis suspects

Asaduddin Owaisi, Asaduddin Owaisi ISIS suspects, Asaduddin Owaisi legal aid to ISIS, Asaduddin Owaisi NIA

Asaduddin Owaisi says MIM to give legal aid to ISIS suspects

అసదుద్దీన్ మాటలకు అర్థాలే వేరులే!

Posted: 07/02/2016 09:27 AM IST
Asaduddin owaisi says mim to give legal aid to isis suspects

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇస్లామిక్ స్టేట్ కు బద్ధ వ్యతిరేకిగా పేరొందారు. గతంలో ఐసిస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బెదిరిపులు కూడా ఎదుర్కున్నారు. అయిన వెనక్కి తగ్గని ఆయన ముష్కరులు తననేం చేయలేరని చెబుతున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో మ‌రోసారి స్పందించారు కూడా.

తాము ఐఎస్ఐఎస్‌కి పక్కా వ్యతిరేకమని, దానిని కూకటి వేళ్లతో సహా పెకలించాల్సిన అవసరం ఉందని ఢంకా భజాయించారు. ఐసిస్ భావ‌జాలాన్ని పూర్తిగా రూపుమాపాల‌న్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసేరు. తాము మొద‌టి నుంచి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నామ‌ని కూడా తేల్చేరు. మరి ఇంత చిత్త శుద్ధి ఉండి చివర్లో ఆయన ప్రకటన ఏంటో తెల్సా?

ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఉగ్రవాదులు కాదు కాదు అమాయకపు యువకులకు న్యాయ సహాయం అందించేదమని అభయం ఇచ్చేరు. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన యువకుల తల్లిదండ్రులు తనను కలిసి వారు అమాయకులని చెప్పినట్టు తెలిపారు. దీంతో వారికి న్యాయ సహాయం అందించాలని నిశ్చయించినట్టు పేర్కొన్నారీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.

అదే సమయంలో తాము ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని అన్నారు. ‘‘యువకులు అమాయకులైతే చూస్తూ ఊరుకోలేం. పోరాడతాం’’ అని అన్నారు. తమ అదుపులో ఉన్న యువకులు మూడు నాలుగేళ్ల తర్వాత నిర్దోషులని తేలితే వారిని అరెస్ట్ చేసిన అధికారులను సస్పెండ్ చేస్తామని ఎన్ఐఏ రాత పూర్వక హామీ ఇచ్చి విచారణ చేపట్టాలని ముందస్తు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల అంతర్యమేంటో ఆయనకైన అర్థమైతే చాలు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  NIA  MIM  ISIS suspects  

Other Articles

Today on Telugu Wishesh