KCR government in Telangana is ready for second phase of haritha haram

Telangana government ready to take another revolution on sentiment

Plants Distribution, Radicals, KCR, Haritha Haram program, green revolution, school students, police, gram panchayats, RandB officials, forest officials, 46 cr platations

Telangana Chief Minister K. Chandrasekhar Rao has asked the government machinery to gear up for launch of 'Haritha Haram' programme to improve green belt from July 8.

ఆ సెంటిమెంటుతో మరో ఉద్యమానికి కేసీఆర్ సర్కార్ రెడీ..!

Posted: 07/02/2016 09:48 AM IST
Telangana government ready to take another revolution on sentiment

ఉద్యమాలతోనే చిరకాల స్వప్పాన్ని సాకంర చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదేంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మరో ఉద్యమం దేనికీ అన్న సందేహాలు రావడం కామన్. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇందుకు ఒక సెంటిమెంట్ ను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుందట. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ వుంది. దాంతోనే తెలంగాణ సాధ్యమైంది.. మళ్లీ ఉద్యమం.. దానికి సెంటిమెంట్ ఏంటని అలోచిస్తున్నారా..? అంత అవసరం లేదులేండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టింది స్వయంగా ప్రభుత్వమే.. అందులోనూ ప్రజాహిత కార్యక్రమాన్నే తీసుకెళ్తుంది కాబట్టి.

విషయానికి వస్తే ప్రతీ మనిషికి జన్మ నక్షత్రం వుంటుంది. లేదా నామాలతో వచ్చే రాశుల వుంటాయి. వీటిని అధారంగా చేసుకుని భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న విషయాలను తెలుసుకుంటుంటారు. అయితే ఇదే సెంటిమెంట్ ను అసరాగా చేసుకుని ప్రజలందరికీ హరిత హారం రెండో దశ కార్యక్రమంలో పాల్గోనేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. నక్షత్ర, రాశులకు సంబంధించిన మొక్కలను పంచి.. వాటిని పెంచి పోషించే దిశగా వారికే బాధ్యతలను అప్పగించి.. ఆకుపచ్చ తెలంగాణ (హరిత హారం) సాధనలో భాగస్వాములను చేయాలని భావిస్తుంది. ఇ:దుకు గాను ప్రజల జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా మొక్కల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొక్కల ఉద్యమానికి జాతక బలాన్ని జోడించాలని, తద్వారా ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంలా జరిగేలా చూడొచ్చని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత హరితహారంపై  ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం కెసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో జన్మ నక్షత్రం, రాశులను బట్టి మొక్కలను పెంచే పద్ధతి ఎప్పట్నుంచో అమల్లో ఉందన్న కేసీఆర్...జన్మ నక్షత్రం, రాశులనుబట్టి ఎవరు ఏ మొక్క నాటితే మంచిదనే విషయంలో జ్యోతిష్యులు, పండితులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. అందువల్ల ప్రజలు కోరిన మొక్కలు సరఫరా చేయాలని ఆదేశించారు.

విద్యార్థి నుంచి సీఎం వరకు అన్ని స్థాయిల పౌరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే ఏడాది 46 కోట్ల మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలుస్తుందని అన్నారు. ‘‘గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలి. చెరువులు, రిజర్వాయర్లు, నదులు, రోడ్ల పక్కన మొక్కలు నాటాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మార్కెట్ యార్డులు, ఆర్టీసీ, సింగరేణి సంస్థల ప్రాంగణాలు, పోలీసుశాఖ కార్యాలయాలు, స్టేషన్ల ప్రాంగణాలు, ప్రార్థనా ప్రదేశాలనూ ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Plants Distribution  Radicals  KCR  Haritha Haram program  green revolution  

Other Articles