వాట్సాప్ లో పోలీసాయన బూతు పనులు | Police Officer suspended for posting obscene pictures on WhatsApp group

Police officer suspended for posting obscene pictures

ASI Mangilal Pawar, obscene pictures on a WhatsApp group, Neemuch SP Manoj Kumar Singh, MP cop porn photos, latest news, naional news, ASI whatsapp group

MP cop sharing porn pics in whatsapp group and suspended.

వాట్సాప్ లో పోలీసాయన బూతు పనులు

Posted: 06/24/2016 09:22 AM IST
Police officer suspended for posting obscene pictures

రోజువారీ పనులతో మిత్రులకు బంధువులకు బిజీ అవుతున్న వ్యక్తులకు ఆన్ లైన్ మీటింగ్‌ వాట్సాప్. సందేశాలతోపాటు క్షణాల్లో ఫోటోలు, వీడియోలు షేర్ చేసేందుకు వాడుతున్న వాట్సాప్ ఇప్పుడు బూతు మెసేజ్‌లకు వేదికవుతోంది. అసభ్యకర ఫోటోలు, వీడియోలను చేరవేసే ఓ పరికరంగా మారుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన ఓ దిగ్ర్భాంతికర విషయంలో పోలీస్ వాట్సాప్ ను ఎలా వాడుతున్నాడో చూడండి.

పోలీస్ ఉన్నతాధికారులు ఉన్న ఓ గ్రూప్ లోనే ఓ ఏఎస్సై అశ్లీల ఫొటోలు పోస్ట్ చేశాడు. నీముచ్ కు చెందిన ఏఎస్సై మంగీలాల్ పవార్ బుధవారం రాత్రి అశ్లీల ఫొటోలను ‘వాట్సాప్’ గ్రూప్ లో పెట్టాడు. అయితే, ఈ ఫొటోలపై గ్రూపు నిర్వాహకుడు(అడ్మినిస్ట్రేటర్) అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇదే గ్రూప్ లో ఎస్పీ మనోజ్ కుమార్ సిన్హా కూడా సభ్యుడిగా ఉండటం విశేషం.

కాగా, ఈ అశ్లీల ఫొటోల పోస్టింగ్ పై సదరు మంగీలాల్ పొంతనలేని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. డిలీట్ చేయబోయి, పొరపాటున ‘సెండ్’ క్లిక్ చేశానంటూ చెప్పుకోచ్చాడు. కానీ, అప్పటికే విషయం పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియటంతో అతనిపై వేటుపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP cop  WhatsApp group  obscene pictures  

Other Articles