Actor Mohanlal Flags Kerala's 'Biggest Terror' To Chief Minister Vijayan

Unhappy with social issues mohanlal pens a letter to kerala cm

Kerala, actor Mohanlal, kerala cm Pinarayi Vijayan, Thiruvananthapuram, Mohanlal blog, biggest terror, swaach kerala, gods own country,

Kerala, God's own country, could do with a thorough clean-up, Malayali actor Mohanlal has pointed out - and in a way that has earned him kudos.

అతిపెద్ద తీవ్రవాదంపై స్పందించిన ప్రముఖ హీరో..

Posted: 06/24/2016 08:58 AM IST
Unhappy with social issues mohanlal pens a letter to kerala cm

పర్యాటకుల స్వర్గధామం, ప్రకృతి తన కోసం నిర్మించుకున్న రాష్ట్రంగా పేరొందిన కేరళలో అతిపెద్ద తీవ్రవాద సమస్యపై ప్రముఖ హీరో స్పందించారు. కేరళ వాసులందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న సమస్యపై ఆయన గళమెత్తారు..? ఆయన మరెవరో కాదు.. మలయాళ హీరో మోహన్‌లాల్‌. అంతేకాదు ఈ సమస్యపై ఆయన ఏకంగా లేఖ కూడా రాశారు.  కేరళ నూతన ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాసి ఈ తివ్రవాదం సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతలా హారోను భయపెడ్డుతున్న సమస్య ఏంటి..?

కేరళలో మోహన్ లాల్ భయపెడుతున్న అతిపెద్ద సమస్య చెత్త. అందుకనే ఆయన దానిని ‘బిగ్గెస్ట్ టెర్రర్’గా అభివర్ణించారు. దీంతో 56 ఏళ్ల ఈ హీరో చెత్త సమస్యపై దృష్టి సారించాలని సీఎంను కోరారు. చెత్త సేకరణ, రోడ్డు ప్రమాదాలు, మహిళల రక్షణపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘కేరళను అత్యంత భయపెడుతున్నదేది? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. చెత్తే అని చెబుతా. పౌరులు చాలామంది తమ ఇంట్లోని చెత్తను రోడ్డుపై పడేస్తున్నారు. అది ఎక్కడ వేయాలో తెలియకపోవడమే ఇందుకు కారణం’’ అని ఆయన పేర్కొన్నారు.

అలాగే యుద్ధాల్లో కంటే ప్రజలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారని, ఈ విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేసి నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. మోహన్‌లాల్ లేఖఫై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మూడు అంశాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు సైతం ఈ స్టార్‌కు మద్దతు తెలుపుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో మోహన్‌లాల్ 300కు పైగా చిత్రాల్లో నటించారు. పలు ఇతర భాషల్లోనూ తన సత్తా చాటారు. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Mohanlal  Pinarayi Vijayan  Thiruvananthapuram  Mohanlal blog  biggest terror  

Other Articles