Uterus removed from man diagnosed with hernia

Doctors find uterus in 23 year old man

rearest medical case, amaresh, krishnagiri district, tamilnadu, kuppam, Dr. Sudhir, Priya nursing home, hernia, uterus, hernia, severe pain, uterus news, hernia news, severe pain news, lifestyle news, health and wellbeing news

In a rare case, doctors at a Kuppam hospital removed a uterus from a 23-year-old man when he was admitted with acute stomach ache.

యువకుడి కడుపులో గర్భాశయం.. ఖంగుతిన్న వైద్యులు..

Posted: 06/24/2016 09:01 AM IST
Doctors find uterus in 23 year old man

వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన. కొట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోంటారు. అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూపిన వైద్యులు మాత్రం ఖంగుతిన్నారు. ఎందుకంటారా.? యువకుడి కడుపులో గర్భసంచి వుండటం సాధారణ విషయం కాదుకద. అందుకనే వైద్యులు విస్తుపోయారు. వృషణాల్లో నొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో అనూహ్యంగా గర్భసంచి, అండాశయం బయపడడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీప్రియ నర్సింగ్ హోంలో వైద్యులకు ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం హోసూరు సమీపంలోని ఇటుకపల్లికి చెందిన అమరేష్(23) కుడి వృషణంలో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతను ఇంగ్యునియల్ హెర్నియాతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అంతేకాక వృషణం ఉండాల్సిన స్థానం ఖాళీగా ఉన్నట్టు గమనించారు. పుట్టుకతోనే అది అలా ఉన్నట్టు అమరేందర్ వైద్యులకు తెలిపాడు.

దీంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. గురువారం శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు యువకుడి కడుపులో గర్భసంచి, అండాశయం ఉండడాన్ని చూసి నివ్వెరపోయారు. వృషణాలు చేయాల్సిన పనిని అతని అండాశయం చేస్తుండంతో ఆశ్చర్యపోయారు. అనంతరం గర్భాశయాన్ని తొలగించారు. అమరేందర్ ఇక నుంచి సాధారణ జీవితం గడపవచ్చని, పెళ్లి చేసుకుని సంతానం కనే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసులు చాలా అరుదని వైద్య పరిభాషలో ‘పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్’ అంటారని వైద్యుడు సుధీర్ పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles