ఫైర్ బ్రాండ్ కి మానవత్వం నిల్ | Renuka Chowdhury slammed in social media for this pic

Renuka chowdhury slammed in social media for this pic

Renuka Chowdhury, Former Union Minister, Twitter pic, child’s nanny, రేణుకా చౌదరీ, రెస్టారెంట్ ఫోటో, మాజీ కేంద్ర మంత్రి, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

Renuka Chowdhury, Former Union Minister of State for Ministry of Women and Child Development, has been receiving flak from social media after a picture of her dining out with family was shared on Twitter. In the picture, her entire family is seen sitting but a child's nanny was seen standing next to her. Congress leader has been criticised for her insensitive behaviour and Twitterati have condemned her for 'modern slavery'.

ఫైర్ బ్రాండ్ కి మానవత్వం నిల్

Posted: 06/02/2016 06:30 PM IST
Renuka chowdhury slammed in social media for this pic

ఆమె ఒక మహిళా, పైగా రాజకీయ అనుభవజ్నురాలు. గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కేంద్రంలో పనిచేశారు. కానీ, మొత్తం మహిళా లోకం సిగ్గుపడేలా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ట్విట్టర్లో దర్శనమిస్తుంటే, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  ఇంతకీ ఏం జరిగిందంటే... రేణుకాచౌదరీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భోజనం చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబలోని ఓ చిన్నపాప బాగోగులు చూసుకునేందుకు నియమించిన బాలికను వారు తినేంత సేపు నిల్చోబెట్టే ఉంచారు. తినమని సరికదా కనీసం ఆ బాలికను కూర్చోబెట్టలేదు.  ఇదంతా గమనిస్తున్న రిషీ బాగ్రీ అనే వ్యక్తి ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు. అది కాస్త దావనంలా వ్యాపించి రేణుకా చేసిన పనిపై మండిపడుతున్నారు.  

ఒక మహిళ , పైగా మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి, ఇలా చేస్తారా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సోనియా గాంధీ పప్పు(రాహుల్ ను ఉద్దేశించి) భోజనం చేస్తుంటే రేణుక ఆ బాలిక లాగే నిల్చుంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. డబ్బు లేకుంటే, అసలు ఆ అమ్మాయిని తీసుకెళ్లకుండా ఉండాలని ఇంకొదరు అంటే, ఆ పార్టీ కల్చరే అంత అంటూ మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు ఆమె అందుబాటులో లేదు.



భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renuka Chowdhury  Former Union Minister  Twitter pic  child’s nanny  twitter  telugu news  

Other Articles