పర్ ఫెక్ట్ సెల్ఫీ కోసం ప్రాణాలు పొగొట్టుకుంది | law student died while taking selfie

Law student died while taking selfie

Pranita Mehta, Jodhpur NLU, light house, Gokarna beach in Karnataka, national news, ప్రణీత, లైట్ హౌస్ సెల్ఫీ, జోధ్ పూర్ లా స్టూడెంట్, తాజా వార్తలు, latest news, national news, telugu news

A law student from Jodhpur in Rajasthan Pranita Mehta died after she slipped from a light house while clicking a selfie at Gokarna beach in Karnataka on May 29. Pranita, along with a group of five friends, was on a tour to visit the beach when this incident took place. The students were all clicking pictures when Pranita slipped from the 300-feet lighthouse during an attempt to capture her 'perfect' selfie.

ITEMVIDEOS: పర్ ఫెక్ట్ సెల్ఫీ కోసం ప్రాణాలు పొగొట్టుకుంది

Posted: 06/02/2016 05:59 PM IST
Law student died while taking selfie

సెల్ఫీ దిగామా, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి లైకులు కొట్టించుకున్నమా... ఇది ఇప్పుడు యూత్ ముందున్న ఒకే ఒక  పని. ఆ మోజులోనే వైవిధ్యం కోసం ప్రయత్నించి ముందూ వెనుకా చూసుకోకుండా ప్రయోగాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఇలా సెల్ఫీలతో తమ జీవితాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజరోజుకీ పెరిగిపోతోంది. తాజాగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ఒక యువతి సెల్ఫీ మోజులో విగతజీవిగా మారింది.

ప్రణీత మెహతా (21) అనే నేషనల్ లా యూనివర్శిటీ లో చదువుతోంది. గత నెల చివరి వారంలో తన స్నేహితులతో టూర్ కి వెళ్లింది. అప్పటికే గోవా, ముంబై తదితర ప్రాంతాలు తిరిగిన వీరు చివరికి కర్ణాటకకు చేరుకున్నారు. మే 29న  గోకర్ణ బీచ్ కు వెళ్లిన ఆమె దాదాపు 300 అడుగుల ఎత్తయిన లైట్ హోస్ పైకి ఎక్కింది. అక్కడ సెల్ఫీ దిగితే అదిరిపోతుందన్న ఆలోచనతో ఫోజు ఇవ్వబోయింది. అంతే కాలుజారి సముద్రంలో పడిపోయింది. అప్రమత్తమైన జాలర్లు యువతిని కాపాడటానికి శాయశక్తుల ప్రయత్నించారు. కానీ, ఆమె జీవితాన్ని కాపాడలేకపోయారు. చాలా సేపు వెతికాక ఆమె దేహాన్ని మాత్రమే బయటకు తేగలిగారు. సరదాగా సాగిన వారి విహారయాత్ర ప్రణీత మృతితో ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranita Mehta  Jodhpur NLU  light house  Gokarna beach in Karnataka  telugu news  

Other Articles