Jet Airways Offers Special Low Fares To Beat Lean Season

Jet airways launches special low fares to beat lean season

Jet Airways,jet airways announces special low fares,jet airways offer,air india offer,lean season,Spicejet discount fares,airasia india offer,Air India,MakeMyTrip,air fares fall 35 percent,Indian Civil Aviation,domestic air traffic,airasia monsoon sale

Jet Airways has announced special low fares for travellers to beat what is considered lean season in aviation business.

చౌకధర యుద్దంలోకి జెట్ ఎయిర్ వేస్.. ప్రయాణికులకు అఫర్

Posted: 06/02/2016 07:42 PM IST
Jet airways launches special low fares to beat lean season

స్పైస్ జెట్ రూ.511 ఆఫర్ అనంతరం విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. స్పైస్ జెట్ కు కౌంటర్ గా భారత అతిపెద్ద విమానసంస్థ ఇండిగో సైతం దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి రూ.806కే టిక్కెట్ ధరను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఆ తరువాత ఎయిర్ ఏసియా కూడా ఈ చౌకధరల యుద్దంలో పాల్గొంటూ ఆఫర్లను ఇచ్చేసింది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కూడా ఈ పోటీలో చేరి తానెం తక్కువ కాదని వచ్చేసింది. లీన్  సీజన్  నేపథ్యంలో  విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది.

వరుసగా  ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు  అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ  ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన ప్రయాణికులకు  శుభవార్త  అందించింది.  గతంలో సెవెన్  డేస్ సేల్  ప్రకటించిన జెట్  తాజాగా   'ఫైవ్ డే సేల్‌' స్కీమ్‌ను ప్రకటించింది. రాబోయే  వర్షాకాల సీజన్ను దృష్టిలోపెట్టుకుని స్పెషల్ తగ్గింపు ధరల్లో అందిస్తున్నట్టు తెలిపింది.  తమ టికెట్ ధరల్లో  20 శాతం  స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించింది.

బిజినెస్ , ఎకానమీ రెండు క్లాసుల్లో పరిమిత కాలానికి డొమెస్టిక్ మార్కెట్ కు ఇది వర్తిస్తుందని ఒక ప్రకటనలో  సంస్థ తెలిపింది. జూన్  2 వ తేదీ 6 వరకు ఈ బుకింగ్స్  చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది.  ఇలా బుక్  చేసిన టికెట్లతో జూన్ 25 నుంచి సెప్టెంబర్30 లోపు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ ఫైవ్ డే సేల్‌'  ఈ నెల 2-9 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్‌ ధరల్లో దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. ఎకానమీ,బిజినెస్ తరగతుల ప్రయాణికులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles