జయలలిత తల్లికి వంగి వంగి దండాలు | watch how AIADMK supporters greeted 'Amma' after her victory

Watch how aiadmk supporters greeted amma after her victory

Tamilnadu, elections, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, కెప్టెన్, విజయ్ కాంత్

At 7 AM, the skies above Chennai seemed to promise better treatment after three days of pounding rain which began on the voting day, May 16. The rains made amends on counting day with the clouds allowing a watery sun to peak out. But the mood outside the residence of AIADMK chief J Jayalalithaa was not cheery. Not yet. In fact, it was sombre.

ITEMVIDEOS: జయలలిత తల్లికి వంగి వంగి దండాలు

Posted: 05/19/2016 04:30 PM IST
Watch how aiadmk supporters greeted amma after her victory

తమిళనాడులో మరోసారి జయకేతనం ఎగరేశారు జయలలిత. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో ఈ పురచ్చితలైవి డిఎంకె కూటమి కంటే కేవలం 26సీట్లు మాత్రమే ఎక్కువ గెలవగలిగారు. అయితేనేం.. అంతిమంగా విజయం ఆమెదే. మళ్ళీ జయదే అధికారం అని తెలీగానే పొయస్ గార్డెన్స్ నివాసం వద్ద ఒకటే హడావిడి. పార్టీ నాయకులు, అధికారులు తామరతంపరగా వచ్చేశారు. లోపల విజిటర్స్ హాలులోని ప్రత్యేక రూమ్ లో ఓ సింహాసనం లాంటి కుర్చీ మీద జయ కూర్చొని ఉన్నారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ ఒకరొకరినే లోపలికి పంపుతున్నారు. లోనికి వెళ్ళిన దాదాపు ప్రతీ ఒక్కరూ ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కొంతమంది ముఖాలవైపు కూడ జయ చూడడం లేదు. వారు వచ్చి కాల్మొక్కి వెళ్ళి పోతున్నారు.

తమిళనాట.. ముఖ్యంగా జయలలిత పార్టీలో ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. అమ్మ అని అంతా జయను అభిమానంగా పిల్చుకుంటారు. ఇవాళ విక్టరీ స్పీచ్ లో కూడా జయ –‘ పిల్లలకు ఏం కావాలో తల్లికి తెలుసు’ అంటూ ప్రజాసమస్యలు తీరుస్తానని, కష్టాలు కడతేరుస్తానని చెప్పకనే చెప్పారు. సాష్టాంగ నమస్కారం చేసిన నేతల పేర్లు ఆమె గుర్తు పెట్టుకుంటారు. పదవుల పంపిణీ సమయంలో వారికి ఏదో ఒకటి దక్కడం ఖాయం.. నచ్చితే అందలం ఎక్కించడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కేయడం జయ కు సాంబారుతో పెట్టిన విద్య. ఎవరూ ఆమెను ఎదిరించి మాట్లాడరు. ఆమెకు ఇష్టం లేని పని చేయరు. ఎవరైనా చేస్తే ఆమె ప్రాపకం కోసం ఆ చేసిన వారికి బుద్ధి చెప్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles