Watch: Police dashcam catches view of blazing meteor

Meteor lights up new england sky

Portland, Portland police sergeant, Maine, United States, North America, Law enforcement agencies, Police, Government and politics, raw, lights, Meteor, Science, Meteor streaking across sky, US,

A Portland police sergeant looking for speeders captured a fireball that flashed across the sky on his dashboard camera.

ITEMVIDEOS: పోలీసు కెమెరాలకు చిక్కిన ఖగోళ అద్భుతం..

Posted: 05/19/2016 03:42 PM IST
Meteor lights up new england sky

అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో దొంగతనాలను జరగకుండా అక్కడ పహారా కాస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దూరంగా స్పీడ్‌గా వెళుతున్న వాహనాల్ని చిత్రీకరించడానికి వారిలో ఒకతను తన డాష్‌బోర్డు కెమెరా తీసి అటువైపు తిప్పాడు. ఇంతలో ఆకాశంలో అద్భుతం. నిప్పులు చిమ్ముతూ అగ్నిగోళాలు విశ్వం నుంచి భూమివైపుగా రాలిపడ్డాయి. దీంతో వెలువడిన ప్రకాశవంతమైన మెరుపు చాలా స్పష్టంగా కెమెరాలో చిక్కింది. అమెరికాలో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించింది. బహుశా ఒక ఉల్క రాలిపడిపోతూ భూ ఆవరణం సమీపంగా వచ్చి ఉంటుందని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు.

 

పోర్ట్‌లాండ్‌ సెంట్రల్ ఫైర్‌ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి టిమ్‌ ఫరీస్‌ కెమెరాలో ఈ అద్భుతం చిక్కింది. అదే సమయంలో ఆయనతోపాటు ఉన్న మరో అధికారి గ్రహం హల్ట్స్‌ 'ఓ మై గాడ్‌' అని అనడం ఈ వీడియోలో వినిపిస్తోంది. నిజానికి ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఈ ఇద్దరు పోలీసు అధికారులే కాదు.. మైనీ, వెర్మోంట్‌, న్యూహాంప్‌షైర్‌, మసాచుసెట్స్‌, రోడె ఐలాండ్‌, కనెక్టికట్, న్యూయార్క్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో వందలమంది చూశారు. చాలామంది ఈ అద్భుతాన్ని తమ కెమెరాలో బంధించి యుట్యూబ్‌లో పోస్టు చేశారు. ఒక ఫ్రిడ్జ్‌ పరిమాణంలో ఉన్న అంతరిక్ష రాయి (స్పేస్ రాక్‌) లాంటి వస్తువు ఏదో నిప్పులు చిమ్ముతూ కూలిపోయిందని, అది భూమికి చేరువగా రావడంతో ప్రకాశవంతమైన మెరుపుతో కాంతులు కనిపించాయని అమెరికా నావల్ అబ్జర్వేటరీ పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meteor  Science  Meteor streaking across sky  US  

Other Articles