KCR suggestion to get special status for AP

Kcr suggestion to get special status for ap

Telangana, KCR, AP, Special Status, Central Govt, Modi, Delhi, Special Status for AP, AndhraPradesh, JAC, AP Protest, Special status protest, ప్రత్యేక హోదా, ఏపి, తెలంగాణ, కేసీఆర్, మోదీ, దిల్లీ, ప్రత్యేక ఉద్యమం, ఏపి జేఏసీ

AP people must KCRs telangana protest strategy. KCR successfully run telangana protest for seperate state. He sucseed.

ఏపికి ప్రత్యేక హోదా రావాలంటే కేసీఆర్ సలహా ఇదే..

Posted: 05/04/2016 10:26 AM IST
Kcr suggestion to get special status for ap

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి దీక్షాదక్షుడో అందరికి తెలుసు.. సింపుల్ గా చెప్పాలంటే తను అనుకున్నది సాదించే వరకు వెనక్కి తగ్గని మోనార్క్ అని. ఎన్నో దశాబ్దాల తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి పెట్టింది కూడా ఆ మొండి తనమే. ఓ పక్క రాజకీయంగా ప్రత్యర్థులకు చెక్ చెబుతూనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అయితే రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉండగా.. ఏపి మాత్రం లోటు బడ్జెట్ ను కలిగి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి అన్ని విధాల న్యాయం చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది కానీ లిఖితపూర్వకంగా ఎక్కడా ఇవ్వలేదు. దాంతో యుపిఎ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కూడా ఏపి ప్రజల జీవితాలతో చలగాటమాడుతోంది.

Also Read: పెళ్లి కావాలంటున్న కేసీఆర్ కూతురు 

ఇలా మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆటలను కట్టించి.. ఏపికి ఎలా ప్రత్యేక హోదా సాధించుకోవాలో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో వివరంగా వివరించారు. నిజంగా వీటిని గనక ఏపి ప్రజలు ఫాలోయితే మాత్రం కేంద్రం దిగివచ్చి.. స్పెషల్ స్టేటస్ ను ఆగమేఘాల మీద ప్రకటించడం ఖాయం. ఇంతకీ కేసీఆర్ ఏం చెప్పాడు.. ఏం చెయ్యాలి అని అప్పుడే అనుకుంటున్నారా..?

Also Read: కేసీఆర్ కు తగ్గ మగాడు అతడేనా..? 

* అన్నింటికన్నా ముందు అప్పుడెప్పుడో వేమన చెప్పినట్లు.. ఓ పనిని ప్రారంభించి వదిలేసేటట్లు ఉంటే అసలు దాన్ని ప్రారంభించకపోవడమే మంచిది. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తాం అనే నమ్మకంతో ప్రారంభించండి.
*ఇక ఉద్యమాన్ని ఉప్పెనలా తీసుకెళ్లాలంటే అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో.. భావి తరాల వారికి దాని వల్ల కలిగే లాభాలను, ఇప్పటికిప్పుడు ఏపికి వచ్చే లాభాలను ప్రజలకు వివరించాలి.
* ఉద్యమంలో ఖచ్చితంగా మాటల తూటాలు, సాహిత్యం ఉద్కీయమాన్ని కీలకదశకు చేరుస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అంత ఉృతంగా తీసుకెళ్లడానికి వేల మంది కళాకారులు కృషి చేశారు. కాబట్టి కళాకారులను రంగంలోకి దించాలి లేదంటే కళాకారులు రంగంలోకి దిగాలి. 
* అన్నింటికి మించి విద్యార్థి శక్తి ముందు ఏ శక్తీ తాళలేదు కాబట్టి యూనివర్సిటీలను ఉద్యమానికి కేంద్ర బిందువులు మారిస్తే మంచింది.
* ఉద్యమం సెగ దిల్లీకి తగలాలి అంటే అక్కడ ఉన్న ఎంపీలు కేంద్రానికి అల్టిమేటం జారీ చెయ్యాలి.. నెల రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకోవాలని లేదంటే రాజీనామా చేస్తామని వెల్లడించాలి. ఒకవేళ ఎంపీలు అలా చెయ్యకపోతే ఏపిలో పరిస్థితులు అలాంటి కష్టమైన పరిస్థితులను కల్పించాలి.
* ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జేఏసీ ఏర్పడాలి.
* గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో ఎలా అయితే ఏపి మొత్తం ఏకమైందో అలాగే ఇప్పుడు కూడా ఏకంగా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడాలి.
*ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి.... కేంద్రం నుండి ప్రత్యేక హోదా అనే ప్రకటన తప్ప వేరే దేని గురించి పట్టించుకోరాదు.
* కేంద్రం నిధులు ఇస్తామని ముందు నుండి అంటోంది.. కానీ రెండు సంవత్సరాల్లో ఇచ్చింది లేదు. కాబట్టి ప్రత్యేక నిధిని ఇస్తాం అంటే కేవలం ప్రత్యేక హోదా మాత్రమే కావాలని పట్టుబట్టాలి.
*ఇక ఉద్యమ సెగ దిల్లీకి తాకాలంటే ఏపిలో పరిస్థితులు మారాలి.. ప్రజావ్యవస్థను మొత్తం స్తంభించాలి. అందుకు ప్రజలనను ముందే సిద్దం చెయ్యాలి.. అది ఐదు రోజులుకావచ్చు.. యాభై రోజులు కావచ్చు  కానీ దానికి సిద్దంగా ఉండాలి.

Also Read: బాలకృష్ణను కేసీఆర్ అడిగిన కోరిక ఏంటంటే 

అయితే ఇది ఒక్క రోజుతో ముగిసిపోయే పోరాటం కాదు కాబట్టి అన్నింటికి మించిన ఆత్మవిశ్వసం, ఓపికి ఉండాలి. రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు.. నీరుగార్చే వాళ్లుంటారు. అయినా కానీ ముందుకు సాగాలి. వచ్చిన వారిని కలుపుకొని పోవాలి.. కలిసిరాని వారిని తమలో ఎలా కలుపుకుపోవాలో ఆలోచించాలి. అన్నింటికి మించి నాయకులు ఎవరూ కూడా కొంత మందికి వంతపాడే వైఖరిని అవలంభించరాదు.  ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా అన్న నినాదంలా.. ఒకే ఒక్క షాక్ తో కేంద్రం కిందికి దిగివస్తుంది. గతంలో నందమూరి తారకరామారావు ఇచ్చినట్లు దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చెయ్యాలి. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని అన్నట్లే.. ఏపికి ప్రత్యేక హోదా లేదంటే బలిదానాలకు, బలితీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles