కేసీఆర్ కు తగ్గ మగాడు, మొగుడు అతడేనా..? | He is the perfect man to oppose KCR

He is the perfect man to oppose kcr

RahukGandhi, Congress, Telangana, KCR, CM KCR, TRS Party, T Congress, Telangana Congress, Prashanth Kishore,రాహుల్ గాంధీ, కేసీఆర్, ప్రశాంత్ భూషణ్, తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ

AICC Vice President Rahul Gandhi decided to renovate telangana congress party. Prashanth Kishore may take responsibility.

కేసీఆర్ కు తగ్గ మగాడు అతడేనా..?

Posted: 04/25/2016 08:53 AM IST
He is the perfect man to oppose kcr

తెలంగాణలో తిరుగులేని వ్యక్తిగా, రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఏం పట్టుకున్నా బంగారమే అవుతోంది. తెలంగాణ ఏర్పడిన దగ్గరి నుండి ఏ ఎలక్షన్ పెట్టినా కానీ కేసీఆర్ గెలుపు తథ్యంగా మారింది. ఏ ఎన్నికల్లో అయినా సరే ప్రతిపక్షాలు గల్లంతుకావడం కనిపిస్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నది కేసీఆర్ పాలసీ. అందుకే ప్రతిపక్షాల నాయకులు ఎవరూ కూడా బలపడకుండా బాగా అడ్డుకట్ట వేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చినా కానీ రెండేళ్లలో ఆ చరిష్మాను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ అనే బ్రాండ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా పార్టీని సన్నద్దం చేశారు. తెలంగాణలో మరేనాయకుడి పేరు వినిపించనంతలా మాయ చేస్తున్నారంటే ఆయన చతురత ఎంతో మనకు అర్థమవుతోంది.

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అణువుగాని చోట అధికులమనరాదు అన్నట్లు మన ప్రతిపక్ష నాయకులు అందుకే సైలెంట్ గా ఉంటున్నారు. మరి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విజయయాత్రకు ఎవరు అడ్డుకట్టవేస్తారు అన్నది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాదు. మరి నిజానికి టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కు దక్కిన క్రెడిట్ ను ఎవరైనా మిస్సయ్యారు అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ నాయకులే. తెలంగాణ ఏర్పడక ముందు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకే లాభం అని,. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాత్రం కాంగ్రెస్ సీన్ సితారయ్యింది.

ఏ కీలుకాకీలు విరిగిన హస్తానికి బ్యాండెజ్ కట్టి.. తిరిగి తెలంగాణలో హస్తం హవాను నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ అధినాయకులు వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటి నాయకుడు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి నేటి దుస్థితి మాత్రం వచ్చి ఉండేది కాదు. అందుకే ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఓ ప్లాన్ వేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మగాడు, మొగుడు ఒక్కడే అని డిసైడ్ అయినట్లున్నాడు. గతకొంత కాలంగా కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత చర్చలను బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.

గతంలో మోదీతో పాటు నడిచి బిజెపి పార్టీని విజయతీరాల వైపు నడిపించిన ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించేందుకు రాహుల్ గాంధీ సిద్దమయ్యారట. మోదీ ఎన్నికల ప్రచారంలో, బిజెపి ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తారని రాహుల్ గాంధీ గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణలో మిగిలిన పార్టీలకు ఇప్పటికే పాడె కట్టిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా వెంటిలేషన్ మీదకు పంపించారు. మరి వెంటిలేషన్ మీదున్న కాంగ్రెస్ ను ప్రశాంత్ కిషోర్ తట్టిలేపుతారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు.

రాహుల్ గాంధీ కొన్ని విషయాలను గుర్తంచుకొని ప్రశాంత్ కిషోర్ ను కానీ లేదా మరొకరిని కానీ రంగంలోకి దింపితే బాగుంటుంది. ముందుగా మన బలం తెలియాలి అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎంత బలం ఉంది.. అని తర్వాత ఎదురు వారి బలహీనతలు తెలియాలి అంటే టిఆర్ఎస్ పార్టీ బలహీనతలు అని అర్థం. తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నింటికి మించి కేసీఆర్ లాంటి రాజకీయ చతరుత ఉన్న వ్యక్తిని తట్టుకోగలగాలి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను మూడు నెలల పాటు దగ్గరి నుండి గమనించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారట. ఆ తర్వాత ఆయన కోరిన మార్పులు చేస్తారట. వాటి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను నియోకవర్గానికి ఐదు వందల మంది చొప్పున ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇస్తారట. ప్రభుత్వం మీద ఎలా విరుచుకుపడాలి..పార్టీని సంస్థాగతంగా ఎలా బలపరచాలి.. అన్న వాటిలో ఈ ఐదు వంటల మందికి ట్రెయినింగ్ ఇస్తారట. మొత్తంగా వచ్చే తెలంగాణ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న రాహుల్ గాంధీ ఆలోచన ఎంత వరకు సక్సెస్ బాట పడుతుందో చూడాలి మరి.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles