This Railway Station Got Robbed And Not Even A Single Thing Is Left Now

This railway station got robbed and not even a single thing is left now

Railway Station , Dhanbad-Jhariya-Sindri route, Jharkhand, Stolen, రైల్వే స్టేషన్, దొంగతనం, జార్ఖండ్

The railway station that falls on the Dhanbad-Jhariya-Sindri route (Jharkhand State) was entirely robbed and became invisible in no time. While, some robbed railway tracks and sold them, some others constructed concrete cabins at the station. The railway office has been turned into a poultry farm and they have even started farming on the tracks.

ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ దొంగతనం

Posted: 05/04/2016 10:14 AM IST
This railway station got robbed and not even a single thing is left now

పురుషులందు పుణ్య పురుషులువేరయా అని చిన్నప్పుడు చదువుకున్నాం.. కానీ దొంగతనాల్లోకెల్లా ఈ దొంగతనం వేరయా అని చదువుకోవాల్సి ఉంటుందేమో. అవును.. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కనీ, వినీ ఎరుగని ఓ విచిత్రమైన దొంగతనం ఇది. దొంగలు సాదారణంగా ఇల్లు,బ్యాంకులు,నగల దుకాణాలను లూటీ చేస్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అక్కడి వారు మాత్రం ఇది రికార్డు దొంగతనం అని అంటున్నారు. అయితే ఏం దొంగతనం జరిగింది, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. భారత్ లో జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌భాద్,ఝరియా,సింద్రీ రూట్‌లో ఉన్న రైల్వే స్టేషన్లో దొంగలు తెగబడ్డారు.

అసలే దొంగలు. ఆ మీద దాదాపు పది సంవత్సరాలుగా జన సంచారం లేకుంటే ఊరికే ఉంటారా..? తమ చేతివాటం చూపిస్తున్నారు మరి. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దొంగతనం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ పధకం ప్రకారం వారు రైల్వే స్టేషన్లో ఉన్న సామగ్రితో పాటు రైలు పట్టాలను సైతం ఎత్తుకెళ్ళారు. అయితే దొంగలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఆ రూట్ లో రైళ్ళ రాకపోకలు నిలిపివేయడమే. ఆ రూట్ లో 10 సంవత్సరాల క్రితం రైళ్ళ రాకపోకలు నిలిపివేసారు. దీంతో రెచ్చిపోయిన దొంగలు స్టేషన్లో ఉన్న సామానుతో పాటు పట్టాలను సైతం వదల్లేదు. రైల్వే స్టేషన్ మొత్తం దొంగతనానికి లోనే.. ఇది రైల్వే స్టేషనేనా అని అనిపించేలా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles