ITEMVIDEOS: మంత్రి రావెల కిషోర్ కొడుకు కేసులో ట్విస్ట్.!

Ravela kishore babu son relief in hc over miss behaviour on muslim girl

Ravela Kishore Babu, Ravela Sushil Kumar, AP, Ravela Sushil case, రావెల కిషోర్, రావెల సుశీల్, సుశీల్ కేసు

AP Minister Ravela Kishor babu son Ravela Sushil got relief from HIgh court today. His miss bahaviour with a lady case suspended.

ITEMVIDEOS: మంత్రి రావెల కిషోర్ కొడుకు కేసులో ట్విస్ట్.!

Posted: 04/25/2016 01:01 PM IST
Ravela kishore babu son relief in hc over miss behaviour on muslim girl

ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు రావెల సుశీల్ కుమార్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గతంలో తనను చేయిపట్టి లాగాడు అని కేసు పెట్టిన మహిళ కేసులో కోర్టు రావెల సుశీల్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు తనకు రావెల సుశీల్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదని ఆమె కోర్టులో వెల్లడించడంతో అందరూ షాక్ తిన్నారు. మంత్రిగారి కొడుకు మహిళను చేయిపట్టి లాగాడు అని గతంలో వచ్చిన వార్తలకు భిన్నంగా ఆ యువతి కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.

రావెల సుశీల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని బాధిత యువతి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీంతో రావెల సుశీల్, ఆయన డ్రైవర్ కేసు నుంచి బయటపడ్డారు. సోమవారం నాడు రావెల సుశీల్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. సుశీల్, ఆయన డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని బాధితురాలు అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు వారి పైన కేసును కొట్టివేసింది. కాగా, ఓ ప్రయివేటు మహిళా టీచర్ చేయి పట్టి కారులోకి లాక్కునేందుకు యత్నించాడన్న ఆరోపణలతో రావెల సుశీల్ కొద్ది రోజుల క్రితం అరెస్టయ్యారు. కాగా తాజాగా ఆయనకు క్లీన్ చిట్ రావడంపై రాజకీయంగా దీని మీద పెద్ద చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles