Lucky escape for traffic warden as huge sinkhole open up in middle of busy road

Sinkhole opens up in middle of busy intersection in china

Sinkhole, traffic warden, disaster, terrifying moment, commuters, Vehicles, busy intersection, China, Hangzhou, eagle-eyed traffic police, massive sinkhole, "coned off" road, sinkhole Zhejiang province,

The traffic warden spots a huge crack in the road surface and initially tries to wave commuters away from it

ITEMVIDEOS: పెను ప్రమాదాన్ని పసిగట్టి నివారించిన ట్రాఫిక్ పోలీస్..

Posted: 04/25/2016 12:28 PM IST
Sinkhole opens up in middle of busy intersection in china

నిత్యం రద్దీగా వుండే ప్రధాన రహదారి అది. అంతేకాదు నాలుగు రోడ్లు కలిసే ప్రధాన కూడలి కూడా. సరిగ్గా నాలుగు నిమిషాల ముందు వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉన్న ప్రాంతం. మండుతున్న ఎండలోనూ విధులు నిర్వహిస్తున్న ఆ ట్రాపిక్ పోలీస్ అధికారి.. ఏకంగా సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అదేంటి చాలా మంది ట్రాఫిక్ పోలీసులు ఎండలో విదులు నిర్వహిస్తుంటారు..? అంతమాత్రాన వారందరూ హీరోలేనా..? అంటే అవుననే చెప్పాలి. అయితే వారిందరిలోకి ఈ ట్రాఫిక్ పోలీసు అధికారి కొంత ఢిఫరెంట్. ఎందకంటారా..?

వాహనాలను నియంత్రిస్తూ విధి నిర్వహణలో ఉన్న ఆయన రోడ్డుపై అటూ ఇటూగా నడుస్తూ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నాడు. ఎంతో ఒత్తిడితో చేసే పని అయినా, బిజీగా తన పనిలో ఉండి కూడా అక్కడ జరగబోయే పెను ప్రమాదాన్ని పనిగట్టాడు. తాను ప్రమాదపుటంచుల్లో నిలబడి.. అటుగా వెళ్లే వాహనదారులను ప్రమాదం నుంచి తప్పించాడు. నాలుగు రోడ్ల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు బీటలు రావడాన్ని ఆ అధికారి గమనించాడు. వెంటనే రోడ్డు పై అటూ ఇటూగా నడిచి ఎంత మేర వరకు ప్రమాదకరమో గుర్తించి ఆ ప్రాంతంలోకి వాహనాలు రాకుండా చుట్టూ రోడ్డును మూసివేశాడు.

అంతే ఆయన అలా రోడ్డుపై వాహనాలను నియత్రించాడో లేదో.. సరిగ్గా కొద్ది క్షణాల్లోనే ఆ అధికారి గుర్తించిన ప్రాంతం మొత్తం కుంగిపోయింది. ముందు కొద్దిగా కుంగిన రోడ్డు.. ఆ తరువాత అధికారి ఎంత వరకు రోడ్డును బ్లాక్ చేశాడో సకిగ్గా అంతవరకు రోడ్డు మొత్తం కుంగిపోయింది. ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్లోని హోంగ్జూలో చోటుచేసుకుంది. ఈ వీడియో అక్కడే ఉన్న సీసీకెమరాకు చిక్కింది. ప్రమాదాన్ని గుర్తించడం కొద్దిగా ఆలస్యమైతే పెను ప్రమాదం సంభవించిఉండేదని, సదరు అధికారిని ప్రపంచ మీడియాతో పాటూ, వీడియో చూసిన వారంతా రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మనం కూడా ఆ అదికారికి వెల్ డన్ విష్ చేద్దాం

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sinkhole  busy intersection  China  Hangzhou  Zhejiang province  

Other Articles