టీచర్ ను చితకబాదిన స్టూడెంట్స్ | Students beats teacher in China

Students beats teacher in china

china, Teacher, Students, Students beat teacher, Fanji High school, చైనా, టీచర్, స్టూడెంట్స్

A teacher in China bore the brunt of a vicious classroom uprising after he tried to forcibly collect a student’s exam paper in a shocking case of school violence caught on camera.The Fanji High School teacher reportedly lost control of his class as he tried to collect test papers.

ITEMVIDEOS: టీచర్ ను చితకబాదిన స్టూడెంట్స్

Posted: 04/25/2016 12:10 PM IST
Students beats teacher in china

చదువు చెప్పే గురువులను ఎంతో గౌరవించాలి, గురు శిష్యుల మధ్య బంధం అలాంటి మరి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గౌరవం మాట అటుంచి.. కనీసం టీచర్ అని కూడా చూడటం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన గురించి తెలిస్తే ఖచ్చితంగా షాకవుతారు.ఓ హాల్ లో పరీక్ష జరుగుతుండగా.. స్టూడెంట్ ను అడ్డుకుని, చిట్టీలు ఏమైనా తెచ్చాడా అని ఆరా తీస్తుండగా, విద్యార్థికి టీచర్ కు మధ్య వివాదం చెలరేగింది. చివరకు ఆ టీచర్ ను క్లాస్ రూంలోనే చితకబాదిన ఘటన చైనాలో కలకలం రేపుతోంది. దీని సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చైనాలోని మారుమూలన ఉన్న ఫాన్జీ స్కూల్లో జరిగిన ఘటన ఇది. అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో విద్యార్థులను తనిఖీ చేస్తుండగా.. ఓ విద్యార్థి వల్ల మొదలైన ఈ వివాదం చివరకు టీచర్ కు పిడిగుద్దులతో సమాధానం చెప్పారు. చిట్టీలు తీసుకువచ్చాడు అని ఓ స్టూడెంట్ తో వాదులాటకు దిగిన టీచర్ ను ఆ స్టూడెంట్ చితకబాదినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే అసలు ఆ టీచర్ ఏమన్నాడో మాత్రం తెలియలేదు. అలా టీచర్ ను ఓ స్టూడెంట్ ను కొడుతుంటే మరికొంత మంది కూడా చేరి టీచర్ ను క్లాస్ రూంలోనే చితకబాదారు. మొత్తం ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles