'abandoning toddler' inside hot car for strip club audition

Auditioning stripper left baby in hot car

nashville, tennessee, toddler, hot car, infant, heat, strip club, strippers, Kelsey McMurtry, Tennessee woman, 13-month-old baby, strip club auditions, Deja Vu Showgirls, central Nashville, Summer Taylor, Woman leaves infant in car, charges of child neglect, criminal impersonation

A Tennessee woman has been arrested after she allegedly left a 13-month-old baby in a hot car outside a strip club while she auditioned.

కారులో చంటిబిడ్డను వదలి.. న్యూడ్ డాన్స్ అడిషన్స్ కు తల్లి..

Posted: 04/18/2016 06:36 PM IST
Auditioning stripper left baby in hot car

కన్న పేగు మమకారం తల్లికి తప్ప, తలైన మహిళలకు తప్ప ఇతరులకు అర్థం కాదన్నది వాస్తవం, అయితే కన్న పేగును కారులో వదిలేసి వెళ్లే తల్లుల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది, అయితే అదేదో అత్యంత అవసరమై రెండు మూడు నిమిషాల్లో వస్తామనుకుంటే పర్వాలేదు కానీ.. ఎంత సమయం పడుతుందో కూడా తెలియని చోటికి వెళ్లినప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం, ఇప్పటికే అనే సందర్భాల్లో కారులో పిల్లలను వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు.. వారిని పోగోట్టుకుని సంతానశోకంలో మునిగిన ఘటనలు అనేకం చూశాం.

సరిగ్గా ఇలాంటి ఘటనే అక్కడ కూడా నమోదయ్యేుది. అయితే దారినపోయే పాదచారిని కారులోంచి చంటిపాప ఏడుపు వినబడటంతో పోలీసులకు సమాచారం అందజేసింది, హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పాపను బయటకు తీసి అమె ఏడుపును అపించే ప్రయత్నం చేశారు. అప్పటికే అరగంట పాటుగా పాప ఏడుస్తుందని పాదచారిని పోలీసులకు తెలిపారు. ఇక పాప తల్లి ఎక్కడుందో కనుకున్నే ప్రయత్నం చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఓరి దేవుడా..! ఇలాంటి తల్లులు కూడా వుంటారా..? అని ముక్కున వేలేసుకున్నారు.

ఇంతకీ అ మహా తల్లి బిడ్డను కారులో వదిలేసి ఎక్కడికి వెళ్లిందో తెలుసా..? ఆడిషన్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. అది కూడా ఒంటి మీది వలువలు ఒక్కొక్కటి వదిలేసి.. క్లబ్బులో నగ్నంగా చేసే స్ట్రిప్  డ్యాన్స్‌ ఆడిషన్‌. అక్కడ చంటిబిడ్డ తల్లి అని తెలిస్తే రాణిస్తారో..? లేదోనన్న సందేహం వచ్చిందేమో కానీ.. ఏకంగా బిడ్డను కారులో వదిలేసి, లాక్ చేసి మరీ అడిషన్స్ కు వెళ్లింది. చివరకు కటకటలాపాలైంది.

కాగా, ఆడిషన్స్‌ జరుగుతున్న క్లబ్బు బయట లాక్‌ చేసి ఉన్న కారులో గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని ఓ పాదచారి గమనించి పోలీసులకు కాల్‌ చేసింది. ఈ ఘటన అమెరికా టెన్నిస్సీ రాష్ట్ర రాజధాని నాష్‌విల్లెలో జరిగింది. ఇంకేముంది పోలీసులు వచ్చి బిడ్డను కారులో నిర్లక్ష్యంగా వదిలేసి, స్ట్రిప్ డాన్స్ ఆడిషన్స్‌కు వెళ్లినందుకు 24 ఏళ్ల కెల్సే మెక్‌మర్టీ, ఆమె స్నేహితురాలు పోలీసు కేసు ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశారనే అభియోగాలను పోలీసులు వారిపై మోపారు. స్ట్రీప్ డ్యాన్స్ క్లబ్బు ముందు సుమారు 40 డిగ్రీల ఎండలో చిన్నారిని కారులో వదిలేసి వెళ్లిందని పోలీసులు తమ కేసులో పేర్కోన్నారు.

పోలీసులు వచ్చి ఆ పాపను కారు నుంచి బయటకు తీసే సమయానికి కారులో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయింది. పోలీసులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత పిల్లల సంరక్షణ కేంద్రానికి చిన్నారిని అప్పగించారు. మర్టీ మాత్రం తన స్నేహితురాలు సమ్మర్ టైలర్‌ను చిన్నారి సంరక్షణ కోసం ఉంచి తాను ఆడిషన్స్ కు వెళ్లినట్టు చెప్తుండగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం కారులో చిన్నారి మాత్రమే ఉందని స్పష్టం చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kelsey McMurtry  Tennessee woman  Strip club audition  Infant in hot car  america  

Other Articles