Andhra pradesh government to distribute free buttermilk

Free buttermilk distribution in ap

Andhra Pradesh, AP CM Chandrababu, AP cabinet meet, AP cabinet decisions, buttermilk, hot summer, Rs 3 crores, bus stations, railway stations, hospitals, main junctions

Ap government to offer fresh buttermilk to the passers by at bus stations, railway stations, hospitals, main junctions in cities and towns of state, who are moving in hot temperature

మండుటెండలో వెళ్తున్నారా..? ‘చల్ల’టి కబురు అందిందా..!?

Posted: 04/18/2016 07:19 PM IST
Free buttermilk distribution in ap

తెలుగు రాష్ట్రాలలో నానాటికీ పెరుగుకు పోతున్న ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో తమ పనులపై బయటకు వెళ్లక తప్పని ప్రజలకు ఒక చల్లని కబురును అందించింది. ఎండల వేడిమి తట్టుకోలేక శీతలపానీయాలు, కొబ్బరి బోండాల, లెమన్ డ్రింక్స్ ల వైపు వెళ్తూ.. డబ్బులను ఖర్చుచేస్తున్న వారితో పాటు వాటిని సైతం చూడటానికే కానీ అస్వాధించలేమని అనుకునే బడుగులకు, పేదలకు కూడా చక్కనైన, చల్లటి వార్తను తెలిపింది చంద్రబాబు సర్కారు.

ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలో చల్లని మజ్జిగను అందించాలని నిర్ణయం తీసుకుంది, ఈ మేరకు ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎండల వేడిమి తీవ్రత, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించింది. వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. వేసవి ముగిసేవరకు 45 రోజుల పాటు రాష్ట్రంలో మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రతీ జిల్లాలోనూ మజ్జిగ పంఫిణీకీ ఏర్పాటు చేయాలని అదేశాలు జారీ చేశారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, కీలక జంక్షన్లు, మార్కెట్ల వద్ద మజ్జిగ పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది, ఇందుకోసం కోసం జిల్లాకు 3 కోట్ల రూ.ల చొప్పున కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీలోని 10 జిల్లాల్లోను 45 రోజులపాటు ఉచిత మజ్జిగ పంపిణీకి 30 కోట్ల రూ.లు వెచ్చించనున్నారు, ఇక దీనితో పాటు వడగాడ్పుల మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై ఆర్థిక, న్యాయ శాఖల అధికారుల సలహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. త్వరలోనే వారికి కూడా పరిహారం అందించనుంది ఏపీ ప్రభుత్వం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles