how do outers entered into HCI premises asks high court, issues notice

High court issues notice to state and central government

High Court, V. Hanumantha rao, VH , HCU, Telangana, Congress MP, VC AppaRao, Telangana government, central government, HCU management

Hyderabad High court issues notice to telangana state and central government along with the managment of HCU asking on how did outers enter into the univesity premises,

న్యాయమూర్తి ముందు వాదిచేస్తానంటూ వెళ్లి.. అబాసుపాలైన వీహెచ్

Posted: 04/18/2016 06:32 PM IST
High court issues notice to state and central government

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతకు హైకోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీని మార్చాలని హైకోర్టులో పిటీషన్ వేసిన వీహెచ్ ను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకోచ్చి వదిలారు, అదేంటి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ను పోలీసులు బయటకు తీసుకురావడం ఏంటి.. అదే మరో పరిబాషలో చెప్పాలంటే లాక్కెురావడం ఏంటన్న సందేహం మీకు కలుగుతుందా..? వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కేంద్రీమ విశ్వవిద్యాలయం వీసీ అప్పరావును తొలగించాలంటూ ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది.

దీనిపై విచారించిన న్యాయస్థానం, ఏ చట్టం ప్రకారం ఆయనను సస్సెండ్ చేయాలో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. అంతే ఇక తాను న్యాయవాదిలా ధర్మసానం ముందుకు దూసుకెళ్లిన వీహెచ్.. తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. సుమారుగా ఆరువేల మంది విద్యార్థులు వీసీ అప్పారాపు నిరంకుశ నిర్ణయాలతో రోడ్డున పడ్డారని, రోహిత్ వేముల అనే యువ మేధావి ఆత్మహత్యకు కూడా వీసి కారణమయ్యాడని చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయస్థానంలో నేరుగా వాదనలు వినిపించడమేంటని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు,

అయినా వెనక్కు తగ్గని వీహెచ్ మరింత ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు, దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పోలీసులను పిలచి వారి చేత వీహెచ్ ను బయటకు పంపించారు. ఆ తరువాత వీహెచ్ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనికి బయటి వ్యక్తులు ఎలా వచ్చారు..? ఎందుకు ప్రవేశించారని ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, యూనివర్సిటీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేశారు.

రోహిత్ వేముల ఆత్మహత్యకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావే కారణమని ఆ తరువాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. హైకోర్టులో ఈ ఘటనపై విచారణ అనంతరం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా వీసీగా అప్పారావును కొనసాగించడం సరికాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును మార్చేలా కేంద్రంతో మాట్లాడాలని ఆయన సూచించారు. వివాదాలకు నెలవైన వీసీ అప్పారావును విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles