రాజమండ్రిలో రేప్.. నలుగురు యువకుల దాష్టీకం | Gang Rape On Kerala Girl In Rajahmundry

Gang rape on kerala girl in rajahmundry

Rajahmundry, Rape, AP, Gang Rape, రాజమహేంద్రవరం, రాజమండ్రి, గ్యాంగ్ రేప్, రేప్

A girl was abducted and raped by a gang of four on Sunday afternoon in Rajahmundry. Going to attend her friend's wedding function at TTD Kalyanamandapam, the girl was riding a bike to the venue along with others when she was ambushed by the culprits. While they snatched the bike keys and cell phones, the victim was held captive while others were let off.

ITEMVIDEOS: రాజమండ్రిలో రేప్.. నలుగురు యువకుల దాష్టీకం

Posted: 04/18/2016 09:55 AM IST
Gang rape on kerala girl in rajahmundry

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలి పెళ్లి కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని ముగ్గురు రౌడీషీటర్లు అపహరించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతిని ఆటోలో రాజమండ్రికి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని డీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు రౌడీ షీటర్లతోపాటు యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాంతో యువతి పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది.

పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే బాధితు రాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టిటిడి కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు. కాగా మొత్తం వ్యవహారం మీద హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద వెంటనే తనకు రిపోర్ట్ చెయ్యాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా నిందితులను పట్టుకోవాలని ఆయన ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles