Roja Said there is no Men in TDP

Roja said there is no men in tdp

టిడిపిలో మగాళ్లు లేరట..?!

Posted: 04/18/2016 07:02 AM IST
Roja said there is no men in tdp

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీ గురించి రోజా చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగుదేశం పార్టీలో మగాళ్లులేరని రోజా
విమర్శించింది. టిడిపి మీద, చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రోజా ఓ అడుగు ముందుకేసి పార్టీలో మగాళ్లే లేరు అనేసింది. టీడీపీలో మగాళ్లయిన ఎమ్మెల్యేలు లేరని సీఎం చంద్రబాబు గుర్తించారు కాబట్టే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని మండిపడిండి.

చంద్రబాబుకి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా.. రాయలసీమ గడ్డపై పుట్టినవాడే అయితే టీడీపీలో చేర్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు రావాలని రోజా సవాల్‌ విసిరారు.
ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పుతో చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయి షాక్‌తో కొట్టుకోవడం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్‌ మంజూరు, తదితర వాటిపై రాష్ట్ర విభజన
సమయంలో పార్లమెంటు సాక్షిగా హామీలు ఇచ్చారని, అయితే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల చేతకానితనం వల్లే వాటి అమలులో కేంద్రం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. ‘ఓటుకు నోటు’ కేసు వల్లే ప్రధాని మోదీ ముందు చంద్రబాబు మోకరిల్లారని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి అమర్‌నాథ్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles