అమర్ నాధ్ దీక్ష భగ్నం | Police shift fasting YSRC leader to KGH

Police shift fasting ysrc leader to kgh

YSRCP, Amarnath, Railway zone, Vishakapatnam, విశాఖ, రైల్వే జోన్, అమర్ నాధ్, ఏపి, వైఎస్ఆర్ కాంగ్రెస్

The indefinite fast launched by YSR Congress district president Gudivada Amarnath demanding that the Central and State governments establish without further delay a separate railway zone for Andhra Pradesh with headquarters in Visakhapatnam as per the promise made in the State Reorganisation Act, was disrupted late on Sunday night.

అమర్ నాధ్ దీక్ష భగ్నం

Posted: 04/18/2016 10:01 AM IST
Police shift fasting ysrc leader to kgh

ఏపి విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ పై రగడ జరుగుతోంది. ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ తో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈస్టు ఏసీపీ రమణ నేతృత్వంలో పోలీసులు అమర్ నాధ్ ను, అతడి మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అమర్‌నాథ్‌ను అరెస్టు చేసి, అనంతరం పోలీసు జీపులో కేజీహెచకు తరలించారు.
 
అమర్ నాధ్ చేస్తున్న దీక్ష వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పదని. గతకొంత కాలంగా అమర్ నాధ్ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే మంత్రులు ఏం చేస్తున్నారని చంద్రబాబు క్లాస్ కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమర్ నాధ్ ఆరోగ్యంీ క్షీణిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు చేజారే అవకాశాలున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు అమర్ నాధ్ దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. కాగా నేటి నుంచి ఇదే శిబిరంలో రిలేదీక్షలు కొనసాగిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. కాగా రైల్వే జోనను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అమర్‌నాథ్‌ గురువారం ఉదయం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles