man arrested ffor cheating young girl in the name of love

Young girl makes her lover arrest after getting ready for marriage

sneha, lover, love cheating, nalgonda lover, nalgonda pa mandal, dharmapuram muthaylu, warangal district, shivanagar colony, vt colony, school of nursing, amrabad, mahaboobnagar,

as per the instructins of nalgonda sp, lover arrested for preparing for marriage with another woman, after cheating one in the name of love

పెళ్లి పీటలెక్కనున్న ప్రియుడిని అరెస్టు చేయించిన ప్రేయసి..

Posted: 03/31/2016 06:15 PM IST
Young girl makes her lover arrest after getting ready for marriage

తనను ప్రేమించానని చెప్పి నయవంచనకు పాల్పడిన ప్రేమికుడు మరో అమ్మాయితో కలసి పెళ్లి పీటలెక్కేందుకు సన్నధం కావడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. పీఏ మండలానికి చెందిన ధర్మాపురం ముత్యాలు, వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కాలనీకి చెందిన స్నేహ స్థానిక వీటీ కాలనీలోని వెన్నెల స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో  2008-2011లో జీఎన్‌ఎం విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా మమాబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రబాద్ మండలం పధిర గ్రామానికి చెందిన సరితతో ఈ నెల 30న వివాహం కోసం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందులోభాగంగా రూ. 3 లక్షల నగదు, 7 తులాల బంగారం, బైకును కట్నంగా మాట్లాడుకున్నారు.
 
తన ప్రేమికుడి మరో యువతితో కలసి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ కావడంతో ప్రియుడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. బాధితురాలి పిర్యాదు మేరకు స్పందించిన ఎస్పీ.. కేసు విచారణ చేయూలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు.  దీంతో రంగంలోకి దిగిన టూటౌన్ ఎస్‌ఐ దుర్గాప్రసాద్ యువకుడు ముత్యాలును అదుపులోకి తీసుకోవడంతో పాటు సరిత కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే సరిత కుటుంబం హైరాబాద్‌లోని నాగోల్ పరిధిలో బండ్ల గూడెంలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడే ఉంటున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా బండ్ల గూడెంలోనే చేశారు. సరిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్మాపురం ముత్యాలును నిలదీయడంతో కట్నంగా ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. స్నేహను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lover cheating  Nalgonda  School of Nursing  police  crime  

Other Articles