India lost the semi final match with west indies

India lost the semi final match with west indies

Virat Kohli, Team India, West Indies, World Cup, T20

India lost the semi final match with west indies. In this match india did 192. Virat Kohli scored 89 runs.

సెమీస్ లో టీమిండియా ఓటమి

Posted: 03/31/2016 11:29 PM IST
India lost the semi final match with west indies

అనుకున్నంతా అయ్యింది. టీమిండియా అబిమానులు దేని గురించైతే భయపడ్డారో అదే జరిగింది. టి20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా నిలిచిన టీమిండియా సెమిస్ లో వెస్టిండీస్ చేతులో ఓడిపోయింది. వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు చివరి వరకు పోరాడి టీంను గెలిపించుకున్నారు. ఇక బౌలర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించే టీమిండియా ఈ సారి కూడా అదే బలహీనతతో ఓడిపోయింది. చివర్లో జడేజా, కోహ్లీ వేసిన ఓవర్లలో వెస్టిండీస్ బ్యాట్స్ మ్యాన్ లు రెచ్చపోయి ఆడారు. వాంఖడే స్టేడియంలో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. టీమిండియా గెలుస్తుందా లేదా అన్న నరాలు తెగే ఉత్కంఠత మధ్య టీమిండియా ఓటమిపాలైంది.

టాస్ ఓడిపోయిన టీమిండియా బ్యాటింగ్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రారంభించింది. రోహిత్ చెలరేగిపోయాడు. డేంజరెస్ బౌలర్ రస్సుల్ ని చితకబాదాడు. ఇక రెహానే క్లాస్ ఇన్నింగ్స్ తో స్పిన్ బ్యాక్ ఫుట్ మీద ఎలా ఆడాలో అందరికీ చూపించాడు. రోహిత్ అవుట్ అయ్యాక వచ్చిన కోహ్లీ బ్రావో బౌలింగ్ లో ఒకే బాల్ రెండుసార్లు రనౌట్ ని తప్పించుకున్నాడు. తర్వాత మెల్లగా క్రీజులో పాతుకుపోయాడు. రెహానే ఔటయ్యాక టాప్ ఆర్డర్ లో వచ్చిన ధోనితో కలిసి చెలరేగిపోయాడు. ధోని కూడ ఎక్కువగా కోహ్లీకే స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. దీంతో విరాట్ కేవలం 47 బంతుల్లో 89 పరుగులు చేసి భారీ టార్గెట్ ని భారీ హిట్టర్ల ముందు నిలిపాడు.

ఇక భారీ టార్గెట్ ని ఛేదించేందుకు వచ్చిన వెస్టిండీస్ ఆరంభంనుంచీ ఆచితూచి ఆడింది. ఫస్ట్ ఓవర్ గేల్ వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువగా ప్రయత్నించాడు. రెండో ఓవర్ బుమ్రా బౌలింగ్ కి దిగగానే ఒక అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బాల్ తో క్రిస్ గౌల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు బిగించింది. తర్వాత టోర్నమెంట్ లో డేంజరెస్ బ్యాట్స్ మెన్ అయిన సామ్యూల్స్ ని నెహ్రా ఒక తెలివైన స్లో బాల్ తో బోల్తా కొట్టించాడు. చార్లెస్, సిమన్స్ తర్వాత చెలరేగిపోయారు.వాళ్లు షాట్స్ కొడుతుంటే స్టేడియం డల్ అయిపోయింది. అందరికీ ఒకటే ఉత్కంఠ. ఇక మ్యాచ్ పోయిందనుకున్నారు. రెండు సార్లు ఇండియన్స్ నోబాల్స్ వేస్తే సిమన్స్ రెండుసార్లు ఔటై మళ్లీ వచ్చాడు. ఇలా టీమిండియా చేసిన కొన్ని తప్పులు వెస్టిండీస్ ను విజయతీరాల వైపుకు నడిపించాయి.


వెస్టిండీస్ స్కోరు వివరాలు: చార్లెస్-52,క్రిస్ గేల్-5, సామ్యూల్ 8, సిమన్స్ 83 (నాటౌట్), రస్సెల్స్-43(నాటౌట్)
భారత్ స్కోరు వివరాలు: రహానే-40(35 బంతులు), రోహిత్ శర్మ-43 (31బంతులు), ధోనీ-15(9బంతులు) నాటౌట్, విరాట్ కోహ్లీ-89 (47 బంతులు)నాటౌట్ గా నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Team India  West Indies  World Cup  T20  

Other Articles