chandrababau Naidu punches while smiling

Chandrababau naidu punches while smiling

AP, Chandrababu, jagan, AP Assembly

AP Cm Chandrababu naidu shows his intelligence with his speech. He punches jagan with his words while smiles.

నవ్వుతూ చంద్రబాబు వేసిన పంచ్ లు

Posted: 03/30/2016 08:55 AM IST
Chandrababau naidu punches while smiling

మొన్నటి దాకా వాడీవేడిగా సాగిన ఏపి అసెంబ్లీలో కొన్ని కాస్త, చమత్కారాలు, సూక్తులు, పాఠాలతో హుషారుగా కనిపించింది. నేటితో ముగియనున్న ఏపి అసెంబ్లీ సామావేశాల సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ కు క్లాస్ తీసుకున్నారు. నవ్వుతూనే జగన్ కు చురకలంటించారు. జగన్‌ విమర్శలకు చంద్రబాబు సమాధానాలిస్తూ... వైసీపీకి చెందిన ఇతర సభ్యులపైనా చెణుకులు విసిరారు. ‘‘జగనను చూస్తే నవ్వొస్తుంది. ఎవరైనా ఒక అలవాటుగా నవ్వుతారు. వెకిలిగా నవ్వుతారు. లేదా... ఏమీ తెలియకపోతే నవ్వుతారు. జగన్‌ మాత్రం ఎందుకు నవ్వుతారో తెలియదు’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘తెలియని వ్యక్తికి చెప్పవచ్చు. తెలిసిన వ్యక్తితో మాట్లాడవచ్చు. కానీ... అన్నీ తెలుసన్న అజ్ఞానితో మాట్లాడటం నాకు చేతకాదు’’... ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి విపక్ష నేత జగన్‌ వ్యాఖ్య. ‘‘నువ్వు వితండవాదివని ఒక అపవాదు ఉంది. ఎవరు చెప్పినా వినవు. నువ్వు మంచి నాయకుడిగా ఎదగాలంటే అవన్నీ వదిలేయ్‌. నువ్వు ఇంకా యంగ్‌స్టర్‌వి! వితండవాదంతో రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోకు!’’... ఇది జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవుపలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu  jagan  AP Assembly  

Other Articles